YOUTH HARASSED ENGINEERING STUDENT: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఇంజినీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్, బాధితురాలి కథనం ప్రకారం, తిరువూరుకు చెందిన ఓ యువతి (19) ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఓ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వచ్చి వెళుతోంది.
పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో యువతిని నమ్మించాడు. గత నెల 12వ తేదీన తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ హుస్సేన్ ఆహ్వానించడంతో ఆమె వచ్చింది. ఆ సమయంలో పెయింటర్‌గా పనిచేసే పరిటాలకు చెందిన షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25)లు కూడా హుస్సేన్ ఇంటిలోనే ఉన్నారు. యువతి చదివే కాలేజీలోనే ప్రభుదాస్ కూడా ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
అయితే అక్కడ ఫంక్షన్ ఏమీ లేకపోవడంతో యువతి నిలదీసింది. నీతో ఒంటరిగా మాట్లాడాలని పిలిచానంటూ హుస్సేన్ ఆమెను నిమ్మించాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి హుస్సేన్ బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదా గది లోపలకు వచ్చి, హుస్సేన్‌తో నువ్వు దిగిన ఫొటోలు నా దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టారు.
![youth harassed engineering student](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23510568_youth_harassed_student.jpg)
అదే సమయంలో ఇంటి బయట హుస్సేన్, ప్రభుదాస్‌లు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారానికి పాల్పడిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బాధితురాలిని ముగ్గురూ బెదిరించారు. తమతో కూడా శారీరకంగా గడపాలంటూ హుస్సేన్, ప్రభుదాస్‌లు ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కేసు నమోదు చేసి, ముగ్గురినీ అరెస్టు చేశామని ఏసీపీ బాలగంగాధర్ వెల్లడించారు.
అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడైన షేక్ గాలి సైదా వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. స్థానికంగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అత్యాచార ఘటన నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సైదా పరుష పదజాలంతో సవాళ్లు విసిరిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో షేక్ గాలి సైదా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
![youth harassed engineering student](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/23510568_youth_harassed_student_2.jpg)
కుమార్తె ప్రేమ వివాహం - సహకరించిన వ్యక్తి హత్యకు తండ్రి సుపారీ