ETV Bharat / state

శ్రీవారి భక్తుల కోసం ఆరువరుసల జాతీయ రహదారి - NH 71 FROM RENIGUNTA TO NAIDUPETA

71వ జాతీయ రహదారిపై రాకపోకలకు అనుమతి - ఆరు వరుసలతో గంటలోపే ప్రయాణం - ఇక సాఫీగా తిరుపతికి బైపాస్‌ ప్రయాణం

Six Lane National Highway-71 Between Naidupeta To Renigunta
Six Lane National Highway-71 Between Naidupeta To Renigunta (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

Six Lane National Highway-71 Between Naidupeta To Renigunta : కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి ఇంతకాలం నాయుడుపేట-రేణిగుంట మధ్య ప్రయాణమంటేనే నరకంగా కనిపించేది. వాహనాల రద్దీతో పాటు కేవలం రెండు వరుసలతో రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో అధిక సంఖ్యలో ప్రమాదాలూ జరిగేవి. కేవలం 57 కి.మీ. దూరం ప్రయాణించేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేది. ప్రస్తుతం ఆరు వరుసల రహదారి అందుబాటులోకి వచ్చింది. 71వ జాతీయ రహదారి విస్తరణ పనులు దాదాపు పూర్తికావడంతో ప్రస్తుతం దీనిపై వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. దీంతో కేవలం గంటలోపే 57 కి.మీ. దూరం ప్రయాణించి సాఫీగా తిరుపతికి వెళ్లే అవకాశం ఉంది.

  • కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో నాయుడుపేట వద్ద మొదలై శ్రీకాళహస్తి, ఏర్పేడు మీదుగా కడప-రేణిగుంట-చెన్నై జాతీయ రహదారిలోని రేణిగుంటకు సమీపంలో ఈ రహదారి కలుస్తుంది.
  • 2020 డిసెంబరులో రూ. 1,931 కోట్లతో దీని నిర్మాణ పనులను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకు అప్పగించారు. 264 హెక్టార్ల మేర భూసేకరణలో చాలావరకు కొలిక్కి వచ్చాయి. అనంతరం 2022 జనవరి 31నుంచి పనులు మొదలయ్యాయి.
  • కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో కలిసేలా నాయుడుపేట వద్ద ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మించారు. అలాగే రేణిగుంట వద్ద రౌండ్‌ అబౌట్‌ నిర్మించారు. మధ్యలో శ్రీకాళహస్తి, ఏర్పేడు వద్ద బైపాస్‌లను ఏర్పాటు చేెశారు.
  • అలాగే స్థానిక వాహనాలేవి హైవే మీదకు రాకుండా హైవేకు ఇరువైపులా సర్వీస్‌ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • లారీలు, బస్సులవంటి వాహనాలు గంటకు 80 కి.మీ.వేగంతో, అలాగే కార్లు వంటి వాహనాలు గంటకు 100 కి.మీ.వేగంతోనూ వెళ్లేలా డిజైన్‌ చేసి నిర్మించారు.
  • ఒకవైపు (మూడు వరుసలకు) 14.5 మీటర్ల చొప్పున అలాగే రెండు వైపులా కలిపి 29 మీటర్లు, మధ్యలో మీడియన్‌ 4 మీటర్లు కలిపి మొత్తం 33 మీటర్ల వెడల్పను ఈ హైవే కలిగి ఉంది.
  • ఈ మీడియన్‌ నుంచి మొదటి లైన్‌ను కార్ల వంటి ఇతర లైట్‌ మోటారు వాహనాల కోసం కేటాయించారు. అలాగే రెండో లైనును లారీలు, బస్సుల కోసం ఏర్పాటు చేశారు. చివరన ఉండే మూడో లైన్‌ మాత్రం అత్యధిక లోడుతో ఉండే, ఎక్కువ చక్రాలు కలిగిన భారీ వాహనాలకు కేటాయించారు.
  • మొత్తం 57 కి.మీ. పొడవునా మీడియన్‌లో గడ్డి, మొక్కలు పెంచేందుకు డ్రిప్​ను కూడా ఏర్పాటు చేశారు.
  • అప్రోచ్‌లు, వంతెనలు, సర్వీస్‌ రోడ్లలో గ్రామాలున్న చోట, అలాగే క్రాస్‌రోడ్స్‌ వద్ద కలిపి మొత్తం 1,500 స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్​ను పెట్టారు. అదేవిధంగా ఏర్పేడు వద్ద టోల్‌ప్లాజా నిర్మించారు.
  • హైవే నిర్మాణ సమయంలో భారీ వర్షాలతో ఆటంకాలు కలిగినా పనులు చేయగలిగామని మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ వైస్‌ప్రెసిడెంట్‌ కె.రాంబాబు తెలిపారు.
Six Lane National Highway-71 Between Naidupeta To Renigunta
స్వర్ణముఖి నదిపై వంతెన (ETV Bharat)

శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై వంతెనతో పాటు ఏడు ప్రధాన వంతెనలు నిర్మించారు. అలాగే మూడు ఆర్వోబీలు, 10 చిన్న వంతెనలు, ఆరుచోట్ల వెహికల్‌ అండర్‌పాస్‌లను ఏర్పాటు చేశారు.

నాలుగు, ఆరు లైన్లుగా ఆ హైవే - త్వరలోనే టెండర్లు

ఆ ఊరిని వణికిస్తున్న హైవే - చీకటిపడితే చాలు గ్రామస్థుల్లో గుబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.