Chandrababu Speech Praja Galam Public Meeting in Tadikonda :2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్ (Chandrababu Fire on CM Jagan) లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాజధాని కోసం 29,000ల మంది అన్నదాతలు 35,000ల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించిందని అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Chandrababu Fires on YSRCP : అమరావతిని కూడా హైదరాబాద్‌లా మార్చేెందుకు ప్రణాళికలు వేశామని చంద్రబాబు తెలిపారు. విజన్ ఉన్న నాయకులతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కానీ అమరావతి కోసం పోరాడిన వారిపై 3,000లకు పైగా కేసులు బనాయించారని ఆరోపించారు. అమరావతి రైతులను జైళ్లలో పెట్టి రకరకాలుగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని, కర్నూలును అభివృద్ధి చేస్తానని చంద్రబాబు అన్నారు.
ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop
మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట :విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శరాజధాని చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించానని, సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేయాలనుకున్నానని గుర్తు చేశారు. జగన్ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని నిప్పులు చెరిగారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని అన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
AP Elections 2024 :అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా అని, మన రాజధాని అమరావతేనని అన్నారు. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయని ఆ జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు, జగనాసుర వధ కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు. జగన్ పోవాలి - ప్రజలు గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.