తెలంగాణ

telangana

ETV Bharat / politics

దిల్లీలో చంద్రబాబు, పవన్‌ - అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు - ఎన్డీఏలోకి టీడీపీ! - Chandrababu Delhi Tour Updates

Chandrababu Pawan Kalyan Delhi Tour : జాతీయ ప్రజాస్వామ్యకూటమి - ఎన్డీఏలోకి టీడీపీ చేరిక ఖరారైనట్లే కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్‌ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటుపైనే సమాలోచనలు జరిగినట్లు తెలుస్తుండగా, కమలదళానికి సీట్ల కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. సీట్ల సర్దుబాటుపై నేడు మరోసారి సమావేశమయ్యే అవకాశముందని సమాచారం.

Chandrababu Pawan Kalyan Delhi Tour
Chandrababu Pawan Kalyan Delhi Tour

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 7:45 AM IST

దిల్లీలో చంద్రబాబు, పవన్‌

Chandrababu Pawan Kalyan Delhi Tour :ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశాన్ని తిరిగి ఎన్డీఏలో చేర్చుకొనే అంశంపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది.

Chandrababu Delhi Tour Updates :ఇప్పటికే బిహార్‌లో నీతీశ్ ​కుమార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌధరిని ఎన్డీఏలోని బీజేపీ అగ్రనేతలు చేర్చుకున్నారు. రేపోమాపో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీనీ చేర్చుకోవడానికి సైతం రంగం సిద్ధం చేశారు. అదే క్రమంలో తెలుగుదేశంతో జట్టు కట్టేందుకు సమాయత్తమయ్యారు. గురువారం రాత్రి 10:30 గంటల నుంచి 12:10 గంటల వరకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు (Chandrababu), పవన్‌లతో అమిత్‌ షా, నడ్డా చర్చించినట్లు సమాచారం.

ఎన్నికల తర్వాత విశాఖలోనే - సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేశారు. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే కసరత్తు జరిగింది. కమలం పార్టీ 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకుమించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మరో దఫా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Pawan Kalyan Delhi Tour Updates : గత నెల 7న అమిత్‌ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు ఒక దఫా చర్చలు జరిపారు. తాజాగా మరోసారి చర్చల కోసం హైదరాబాద్‌ నుంచి గురువారం సాయంత్రం చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) విజయవాడ నుంచి దిల్లీ చేరుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి అమిత్‌ షా నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి, తెలుగుదేశం 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కూటమిలో జనసేన ఉండటం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున, కమలం పార్టీ అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యంకాదనే వాదన తెలుగుదేశం వైపునుంచి వినిపిస్తోంది.

పీకే వ్యాఖ్యలతో జగన్​ ఉక్కిరిబిక్కిరి! - వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఓటమి భయం

మొత్తంగా బీజేపీ, జనసేనకు కలిపి 7 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని, చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ అంశంపై కమలం పార్టీ అగ్రనేతలే చర్చలు జరుపుతున్నందున, ఆ పార్టీలోని రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ స్పందించడంలేదు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి దిల్లీ వచ్చిన చంద్రబాబును ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు కలిసి మాట్లాడారు.

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను మరచిపోవాల్సిందే : పవన్‌ కల్యాణ్‌

ఎంపీ టికెట్ విషయంలోనే వివేకాను సీఎం జగన్‌ చంపించారు : దస్తగిరి

ABOUT THE AUTHOR

...view details