తెలంగాణ

telangana

ETV Bharat / politics

దానం నాగేందర్‌పై వీలైనంత త్వరగా అనర్హత వేటు వేయాలి : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు - PADI KAUSHIK REDDY on danam - PADI KAUSHIK REDDY ON DANAM

BRS MLA Padi Kaushik Reddy on MLA Danam : కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్మించి గొంతు కోశారని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. దానం నాగేందర్‌పై వీలైనంత త్వరగా అనర్హత వేటు వేయాలని సభాపతిని కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.

BRS MLA Padi Kaushik Reddy Press Meet
BRS MLA Padi Kaushik Reddy Press Meet

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 6:52 PM IST

BRS MLA Padi Kaushik Reddy on MLA Danam : దానం నాగేందర్‌పై తమ ఫిర్యాదు ఆధారంగా వీలైనంత త్వరగా అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారుగా నిలవాలని శాసన సభాపతి ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. 12 రోజులైనా స్పందన లేకపోవడంతో అదనపు అఫిడవిట్ సమర్పించేందుకు సభాపతిని కలిసేందుకు వెళ్తే ఎవరూ లేరన్నారు. కార్యదర్శిపై ఏం ఒత్తిళ్లు ఉన్నాయో కానీ ఆయన కూడా అందుబాటులో లేరని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద పాడి కౌశిక్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పాడి కౌశిక్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా కూడా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించారని, సభాపతి నిర్ణయం తీసుకొని అనర్హత వేటు వేస్తే దేశం మొత్తం హర్షిస్తారని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలం వెళితే కనీసం వినతిపత్రం తీసుకోరా అని ప్రశ్నించారు. సభాపతి చర్య తీసుకోకపోతే న్యాయస్థానానికి వెళ్తామని చెప్పారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదని కౌశిక్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

'ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నాం - అందుకే తగిన నిర్ణయం తీసుకున్నాం'

Padi Kaushik Reddy Fires on Kadiyam :కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమేనని పాడి కౌశిక్‌ రెడ్డి విమర్శించారు. ప్రజలు ఛీ అనే పరిస్థితి ఉందని, కడియం శ్రీహరి నీతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. అన్నం తినేవాళ్లు మాత్రం ఇలా చేయరని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ నుంచి వెళ్లే వారందరికీ రాబోయే కాలంలో తగిన తీర్పు ఉంటుందని చెప్పారు. నీళ్లు లేక రైతులు లబోదిబోమని ఏడ్చే పరిస్థితి ఉందని, వారందరికీ ధైర్యం చెప్పేందుకు కేసీఆర్‌ ఆదివారం పరిశీలనకు వెళ్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తెలిపారు.

అనర్హత పిటిషన్‌ తీసుకొని ఉపకార్యదర్శి : అంతకు ముందు దానం అనర్హత పిటిషన్‌పై అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయడానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. ఆ సమయంలో సభాపతి, శాసనసభ కార్యదర్శి అందుబాటులో లేరు. అనర్హత పిటిషన్‌ తీసుకోవాలని ఉపకార్యదర్శిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే ఆ అర్హత తనకు లేదని ఉప కార్యదర్శి వారికి చెప్పారు. ఈ క్రమంలో ఆయనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే అనర్హత పిటిషన్‌ తీసుకోలేదని ఉపకార్యదర్శి వారికి వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

'కోమటిరెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు - బీజేపీ గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది'

ABOUT THE AUTHOR

...view details