Kaushik Reddy Comments on Arekapudi Gandhi : కోట్లకు అమ్ముడుపోవడం, భూ పంచాయితీలో సెటిల్‌మెంట్ల కోసమే అరెకపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో ఎలా చేరతావని నిలదీశారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లోనే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని పేర్కొన్నారు. అరెకపూడి గాంధీ బీఆర్‌ఎస్‌లోనే ఉంటే గాంధీ తెలంగాణ భవన్‌కు రావాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకెళదామని చెప్పారు. రేపు ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి అరెకపూడి గాంధీ ఇంటికెళ్తామని తెలిపారు.
గాంధీ తమ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నందునే ఆయన ఇంటికెళ్తామని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన్ను సాదరంగా తోడ్కొని కేసీఆర్ ఇంటికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి నేరుగా కేసీఆర్ వద్దకెళ్తామని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి వెళ్లిన ప్రతి ఎమ్మెల్యే గురించి తాను మాట్లాడనని వివరించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఎలా అయ్యారో ఆయన్నే అడగండని గాంధీని ఉద్దేశిస్తూ కౌశిక్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డికి తాను ఏం సాయం చేశానో ఆయననే అడగండని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరలేదని అరెకపూడి గాంధీ అన్నారని, తమ పార్టీ ఎమ్మెల్యే అని అందుకే ఆయన ఇంటికెళ్తానన్నానని తప్పేముందన్నారు.
'వ్యక్తిగత దూషణలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేం రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేదని ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది. నాపై గాంధీ అనుచరులు హత్యా యత్నం చేశారు.మహిళలపై కూడా దాడి చేశారు.నా తండ్రి పడుకునే గది అద్దాలు ధ్వంస చేశారు. దాడి విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఉదయం 11 గంటలకు గాంధీ నివాసానికి వెళ్లి అయనకు గులాబీ కండువా కప్పుతా'- కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే