తెలంగాణ

telangana

ETV Bharat / politics

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరసనలు - వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BRS Leaders Protest on Farmers Issues : రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టారు. సూర్యాపేటలో గులాబీ దళపతి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులు పండించిన ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎస్​తో సహా కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. త్వరితగతిన ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

BRS Leaders on Farmers Issues
BRS Leaders Protest on Farmers Issues

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 7:45 PM IST

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరసనలు - వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్

BRS Leaders Protest on Farmers Problems: రైతులను ఆదుకోవడానికి వరికి బోనస్, రైతు భరోసా అమలు, రుణమాఫీ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిశారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రం సమర్పించారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఎకరానికి రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని అన్ని పంటలను రూ.500 రూపాయల బోనస్​తో కొనుగోళ్లు చేయాలన్నారు. కాలువలు, చెరువుల కింద పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు.

BRS Leaders on Farmers Problems : వ్యవసాయానికి నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.15 వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరిసుభాష్ రెడ్డి, దండె విఠల్, సీనియర్ నేత రమేష్ రెడ్డి తదితరులు సీఎస్‌ను కలిశారు.

కేసీఆర్ 'పొలం బాట' పట్టాక రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది : ఎమ్మెల్యే హరీశ్‌రావు - Lok Sabha Elections 2024

BRS MLA Jagadeesh Reddy Fires On Congress : ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ పేరు చెప్పి రైతు రుణమాఫీ ఆపకూడదని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి కోరారు. రుణమాఫీ చేసేందుకుకాంగ్రెస్‌ ఈసీకి లేఖరాస్తే అందుకు సహకరిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వంద రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే పనేది చేయలేదని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్​ను జైళ్లో పెడితే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. కేసులతో భయపెట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారని ఆరోపించిన ఆయన కేసీఆర్ దేనికీ భయపడబోరని బీఆర్ఎస్ త్యాగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఓవైపు ప్రకృతి వల్ల మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

BRS MLA Harish Rao on Farmers Issues :ఎండిపోతున్న పంటలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని సిద్దిపేట కలెక్టర్‌కు మాజీ మంత్రి హరీష్ రావు వినతిపత్రం అందించారు. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందని హరీశ్‌ విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగాయన్న ఆయన 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో సాగు నీరందక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు.

కలెక్టర్‌కు వినతిపత్రం : కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్న 9 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా నీరు లేక ఎండిపోలేదన్న కొప్పుల కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వరికి రూ. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి మెదక్‌ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఎండుతున్న పంటలకు ఎకరానికి రూ. 25వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌కు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి వరంగల్‌ కలెక్టర్‌కు విన్నవించారు. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. వినతుల తర్వాత కూడా బోనస్​పై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 6న అన్ని నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అప్పటికీ సర్కారు స్పందించకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఆందోళనకు దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రైతులు మళ్లీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది : జగదీశ్‌ రెడ్డి - BRS MLA Jagadeesh Reddy

పాడి రైతులకు పెండింగ్​లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులు చెల్లించాలి - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - BRS MLA Harish Rao Letter To CM

ABOUT THE AUTHOR

...view details