ETV Bharat / sports

నితీశ్ 'వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్'- కెరీర్​లో తొలి సెంచరీ- కంగారూల గడ్డపై తెలుగోడి సత్తా - IND VS AUS TEST 2024

సెంచరీతో రఫ్పాడించిన నితీశ్- టీమ్ఇండియాను ఆదుకున్న తెలుగోడు

Nitish Kumar Century
Nitish Kumar Century (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 28, 2024, 11:47 AM IST

Updated : Dec 28, 2024, 11:52 AM IST

Nitish Kumar Reddy Debut Century : మెల్​బోర్న్ టెస్టులో తెలుగుతేజం సెంచరీ (105* పరుగులు)తో కదం తొక్కాడు. కష్టాల్లో ఉన్న టీమ్ఇండియాను అద్భుత పోరాటంతో మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 171 బంతుల్లో కెరీర్​లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేశాడు. నితీశ్​కు తొలి శతకమే ఆస్ట్రేలియా గడ్డపై కావడం విశేషం. ఇక నితీశ్ రెడ్డి శతకాన్ని స్టేడియంలో స్వయంగా వీక్షించిన అతడి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు.

కాగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన నిశీశ్ అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. వాషింగ్టన్ సుందర్ (50 పరుగులు)​తో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా బెదరకుండా పరుగులు నమోదు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్​కు 285 బంతులు ఎదుర్కొని 127 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే నితీశ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్​ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్​లో ఇదివరకు అనిల్ కుంబ్లే (ఆడిలైడ్​లో 87 పరుగులు) టాప్​లో ఉండగా, తాజాగా నితీశ్ ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు.

ఆసీస్​లో 8వ స్థానంలో అత్యధిక పరుగులు బాదిన ఇండియన్స్

  • 105*- నితీష్ రెడ్డి- మెల్​బోర్న్- 2024
  • 87 -అనిల్ కుంబ్లే - అడిలైడ్- 2008
  • 81- రవీంద్ర జడేజా- సిడ్నీ- 2019
  • 67* - కిరణ్ మోర్ - మెల్​బోర్న్- 1991
  • 67 - శార్దుల్ ఠాకూర్ - బ్రిస్బేన్- 2021

ముందే ముగిసిన ఆట
నితీశ్ సెంచరీ పూర్తయ్యాక బ్యాడ్‌లైటింగ్‌ కారణంగా ఆట నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 358/9. క్రీజ్‌లో నితీశ్‌ (105*), సిరాజ్‌ (2*) ఉన్నారు. ఇంకా భారత్ 116 పరుగులు వెనకబడి ఉంది. అయితే వర్షం మ్యాచ్​కు అంతచరాయం కలిగించింది. దీంతో మైదనం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఎంతకీ తగ్గకపోవడం వల్ల ఆటను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసింది. ఇక మూడో రోజు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులకు ఆలౌటైంది.

నితీశ్ ది సేవియర్- ఫాలో ఆన్ తప్పించిన తెలుగోడు- పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్

'నువ్వేం తప్పు చేశావు, నీకు ఈ డిమోషన్ ఏంటీ?'- రాహుల్​పై కవ్వింపు చర్యలు

Last Updated : Dec 28, 2024, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.