తెలంగాణ

telangana

ETV Bharat / politics

మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు - బీఆర్​ఎస్​ది నిర్మాణం, కాంగ్రెస్​ది విధ్వంసం : కేటీఆర్​ - KTR TWEET ON HYDRA - KTR TWEET ON HYDRA

BRS Leader KTR Tweet : కేసీఆర్​ లక్ష డబుల్ ఇళ్ల​ నిర్మాణాలు నిజమని అందుకు హైడ్రా తొలగింపులే సాక్ష్యమని కేటీఆర్​ విమర్శించారు. తాము నిర్మించిన నిర్మాణాలను కాంగ్రెస్​ ప్రభుత్వం కూల్చేస్తుందని ఆగ్రహించారు. తమది నిర్మాణం, కాంగ్రెస్​ది విధ్వంసం అని కేటీఆర్​ ఎక్స్​ వేదికగా ధ్వజమెత్తారు.

BRS Leader KTR Tweet
BRS Leader KTR Tweet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 11:49 AM IST

BRS Leader KTR Tweet on HYDRA Demolitions : మూసీ నది సాక్షిగా మహా నగరంలో కేసీఆర్​ లక్ష డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు కట్టించి ఇచ్చారని, కాంగ్రెస్​ విష ప్రచారాలు, అబద్ధాలు అనడానికి మరో సాక్ష్యం ఇదేనని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. తాము నిర్మించిన నిర్మాణాలను కాంగ్రెస్​ ప్రభుత్వం కూల్చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది నిర్మాణం, కాంగ్రెస్​ది విధ్వంసం అని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

లక్షల నిర్మాణాలు తమవి అయితే, లక్షల కూల్చివేతలు మీవి అని కేటీఆర్​ పేర్కొన్నారు. ఇళ్లు కట్టలేదన్నారని, ప్రజలను మభ్యపెట్టాలని అనుకున్నారని విమర్శించారు. మరి లక్ష ఇళ్లు రాత్రికి రాత్రి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్​ ముందు పెట్టిన 'డబుల్​' లెక్కలు చూసి మతిపోతుందా అని అడిగారు. కేసీఆర్​ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా అంటూ ధ్వజమెత్తారు. మీ జూటాల మాటలు, మీ కుట్రలకు ఈరోజు కేసీఆర్​ నిర్మాణాలే దిక్కయ్యాయని కేటీఆర్​ విమర్శించారు. కేసీఆర్​ లక్ష డబుల్​ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే, ఇంకోసారి అబద్ధాలు మాట్లాడకండి అని కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

"మేము నిర్మిస్తే మీరు కూల్చేస్తున్నారు. మాది నిర్మాణం, కాంగ్రెస్​ది విధ్వంసం. లక్షల నిర్మాణాలు మావి అయితే, లక్షల కూల్చివేతలు మీవి. మూసీ నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్​ లక్ష డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు. కాంగ్రెస్​ విష ప్రచారాలు, అబద్ధాలు అనడానికి మరో సాక్ష్యం ఇదే. ఇళ్లు కట్టలేదన్నారు, ప్రజలను మభ్యపెట్టాం అనుకున్నారు. మరి లక్ష ఇళ్లు రాత్రికి రాత్రి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్​ ముందు పెట్టిన డబుల్​ లెక్కలు చూసి మతిపోతుందా? కేసీఆర్​ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా? మీ జూటా మాటలు, మీ కుట్రలకు ఈరోజు కేసీఆర్​ నిర్మాణాలే దిక్కయ్యాయి. కేసీఆర్​ లక్ష డబుల్​ నిర్మాణాలు నిజం-కేటాయింపులు నిజం. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్ధాలు మాట్లాడకండి." - కేటీఆర్​, ట్వీట్

అమీన్‌పూర్‌ చెరువుపై హైడ్రా ఫోకస్ - నవ్య చౌరస్తాలో భవనం కూల్చివేత - HYDRA DEMOLITIONS IN SANGAREDDY

'హైడ్రా'మా కాదు హైదరాబాద్​ కోసం పని చేయండి : కేటీఆర్​ - KTR ON HYDRA DEMOLITIONS

ABOUT THE AUTHOR

...view details