BRS leader Harish Rao Meet HYDRA Victims : కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇళ్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని తెలిపారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఇళ్లను పరిశీలించి, బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో బీఆర్ఎస్ బృందం భేటీ అయింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఉందని ఆరోపించారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని స్పష్టం చేశారు. మూసీని ఆక్రమించి భవనాలు కట్టిన వారిని అడ్డుకోవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
"పేదలకు ఇళ్లు లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటాం. మూసీని ఆక్రమించి భవనాలు కట్టిన వారిని అడ్డుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి."- హరీశ్ రావు, మాజీ మంత్రి
సీఎం మూసీపై ప్రతిపాదన విరమించుకోవాలి : బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ బాధితులకు అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ అందరికీ ప్రజాభవన్ అర్ధరాత్రి వచ్చినా అండగా ఉంటామని చెప్పారు. రేవంత్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి మూసీపై ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదు, గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అనుమతిచ్చాయని తెలిపారు. చర్యలు తీసుకోవాలనుకుంటే గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని హరీశ్ రావు చెప్పారు.
హరీశ్ రావు అవగాహన ఉన్న వ్యక్తి : బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. హరీశ్ రావు అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. హరీశ్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని వివరించారు.
'రియల్ ఎస్టేట్ వ్యాపారిలా రేవంత్ తీరు - బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోం' - HARISH RAO FIRES ON CM REVANTH
'సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లా? - అఖిలపక్ష సమావేశం తర్వాత మూసీపై ముందుకెళ్లండి' - HARISH RAO MEET HYDRA VICTIMS