తెలంగాణ

telangana

ETV Bharat / politics

కడియం బీఆర్​ఎస్​ నుంచి వెళ్లాక పార్టీలో జోష్​ కనిపించింది : హరీశ్‌ రావు - BRS Harish Rao Comments on Congress

BRS Harish Rao Fires on Congress : కడియం శ్రీహరి రేవంత్​పై విమర్శలు చేసి ఆయనతోనే పార్టీ కండువా కప్పించుకున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Harish Rao on Kadiyam Srihari
BRS Harish Rao Fires on Congress

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 2:38 PM IST

BRS Harish Rao Fires on Congress :బీజేపీని ఎదుర్కొనే పార్టీ కేవలం బీఆర్ఎస్​ మాత్రమే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. వరంగల్​లో బీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యేకడియం శ్రీహరి కాంగ్రెస్​లో చేరడంపై ఫైర్​ అయ్యారు. కడియం బీఆర్​ఎస్​ నుంచి వెళ్లాక పార్టీలో జోష్​ కనిపించిందన్నారు. టికెట్​ ఇచ్చినా పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ (Congress Joinings) నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందని, రూ.2 లక్షల రుణమాఫీని సీఎం అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.

టెట్​ ఫీజులు పెంచడం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేయడమే - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - BRS MLA Harish Rao Letter To CM

"రేవంత్‌ రెడ్డిపై కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పుడు రేవంత్‌తోనే కడియం శ్రీహరి కండువా కప్పించుకున్నారు. ఇంతగా దిగజారడం అవసరమా అని కడియం ఆలోచించాలి. కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తుంది. కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్‌ జిల్లా అగ్నిగుండమవుతుంది." - హరీశ్‌ రావు, మాజీ మంత్రి

"పంటలకు పరిహారం ఇవ్వకుంటే లక్షలాది రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తాం" - Harish Rao Comments on CM Revanth

Harish Rao on Kadiyam Srihari : కాంగ్రెస్​వి ఉద్దర మాటలే తప్ప, ఉద్ధరించేది ఏమీ లేదని హరీశ్​రావు విమర్శించారు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, ఏం చేశారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. కడియం శ్రీహరి రేవంత్​పై (Kadiyam Srihari Joins in Congress) ఎన్నో విమర్శలు చేసి, ఆయనతోనే పార్టీ కండువా కప్పించుకున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరికి నిజాయతీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు.

కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ - రైతులపై ఎందుకు లేదు? : హరీశ్‌రావు - BRS Party Meeting at Kamareddy

ABOUT THE AUTHOR

...view details