తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్​ఎస్ - ఉగాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BRS Campaign in Telangana 2024 : భారత్ రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉగాది తర్వాత అధినేత కేసీఆర్ దిగనున్నారు. ఇప్పటికే లోక్ సభ, నియోజకవర్గాల వారీగా సమావేశాలు సాగుతున్నాయి. 13వ తేదీన చేవెళ్ల బహిరంగసభ నుంచి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పదేళ్ల తమ హయాంలో చేసిన పనులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లనుంది.

KCR on MP Election Campaign 2024
BRS Campaign in Telangana 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 11:45 AM IST

ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్​ఎస్ - ఉగాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలు

BRS Campaign in Telangana 2024 : లోక్ సభ ఎన్నికల వాతావారణం రాష్ట్రంలో రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇప్పటికే పార్టీలు సమావేశాల రూపంలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు అత్యంత సవాల్​గా మారాయి. అసెంబ్లీ ఓటమి నుంచి తేరుకోకముందే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల వలసలు ఇక్కట్లను తెచ్చిపెట్టాయి. 16 స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా వరంగల్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కడియం కావ్య అనుభవం నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థిని ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకోవచ్చని అంటున్నారు.

Telangana Lok Sabha Elections Campaign 2024 : ఇప్పటికే అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేసి ఆ తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మెజార్టీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత మండల స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. బీఆర్ఎస్కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గాల వారీ సమావేశాలకు హాజరవుతున్నారు. నేతలు, శ్రేణులకు లోక్ సభ ఎన్నికలపై దిశానిర్ధేశం చేస్తున్నారు.

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరసనలు - వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ - Lok Sabha Elections 2024

KCR Public Meeting in Chevella :ఉగాది పండుగ తర్వాత గులాబీపార్టీ ప్రచారం మరింత ఉద్ధృతం అవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నారు. అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. 13వ తేదీన చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 15వ తేదీన మెదక్​లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సుయాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్​తో పాటు కేటీఆర్,హరీశ్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది.

నాకు వందల ఎకరాల భూమి ఉంది, డబ్బు మీద ఆశలేదు : క్యామ మల్లేష్‌ - Lok Sabha Elections 2024

ఎన్నికల ప్రచార జోరు పెంచనున్న కారు - కార్యాచరణపై గులాబీ నేతల కసరత్తు - BRS Strategy on MP Elections

ABOUT THE AUTHOR

...view details