BRS Appointed Coordinators : లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తమ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇటీవల పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న కారు పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha polls) కోసం సమన్వయకర్తలను ఆపార్టీ నియమించింది. మల్కాజిగిరి, చేవేళ్ల పార్లమెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించింది. వీరంతా కలసి లోక్‌సభ ఎన్నికల కోసం ఆయా నియోజక వర్గాల్లో పార్టీ నేతలు, శ్రేణులు, కార్యక్రమాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది.
BRS Election Coordinators Appointed For Constituencies : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును, మల్కాజిగిరి సమన్వయకర్తగా కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్‌ను నియమించింది. కుత్బుల్లాపూర్ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కుల వెంగళరావు, కూకట్పల్లి బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి అఫ్పగించారు. ఉప్పల్ సమన్వయకర్తగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ పాష, కంటోన్మెంట్ నియోజకవర్గానికి కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు.
ఎల్బీనగర్ బాధ్యతలను ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తకు ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహేశ్వరం సమన్వయకర్తగా శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్ర నగర్ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత పుట్టం పురుషోత్తం రావుకు అప్పగించారు. శేరిలింగంపల్లికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్, చేవెళ్లకు పార్టీ కార్యదర్శి నాగేందర్ గౌడ్ ను సమన్వయకర్తలుగా నియమించారు. పరిగి బాధ్యతలను పార్టీ నాయకులు గట్టు రామచంద్రరావు, వికారాబాద్ బాధ్యతలను పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి అప్పగించారు. తాండూరు సమన్వయకర్తగా జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ ను నియమించారు