తెలంగాణ

telangana

ETV Bharat / politics

'అల్లు అర్జున్​ ఇంటిపై దాడి ఘటనలో ఉన్నది కొడంగల్‌ వాసులే' - DK ARUNA ON ALLU ARUN HOUSE ATTACK

అల్లు అర్జున్‌ ఇంటిపై దాడిని ఖండించిన బీజేపీ ఎంపీ డీకే అరుణ - కాంగ్రెస్‌ నేతలే దాడి చేయించారనే అనుమానం కలుగుతోందని ఆరోపణ

DK ARUNA ON ALLU ARUN HOUSE ATTACK
DK ARUNA ON ALLU ARUN HOUSE ATTACK (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

MP DK Aruna Condemns Attack On Allu Arjun House : సినీ నటుడు అల్లు అర్జున్‌ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. దాడి ఘటనలో 4 మంది కొడంగల్‌ వాసులున్నారని ఆమె ఆరోపించారు. జైలు నుంచి విడుదలైనటువంటి లగచర్ల రైతులను డీకే అరుణ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ ఇంటిపై దాడి ఘటన నిందితుల్లో ఒకరు కాంగ్రెస్‌ జడ్పీటీసీగా పోటీ చేశారని ఆ పార్టీ నేతలే ఈ దాడి చేయించారనే అనుమానం కలుగుతోందని విమర్శించారు.

అల్లు అర్జున్​ ఇంటిపై దాడి ఘటన :ఓయూ జేఏసీ స్డూడెంట్స్​ యూనియన్​ ఆందోళనతో జూబ్లీహిల్స్​లో అల్లు అర్జున్​ ఇంటివద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతురాలు కుటుంబానికి అల్లు అర్జున్​ వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే నిరసనకారులు అల్లు అర్జున్​ నివాసంపై రాళ్లను విసిరారు. నినాదాలు చేస్తూ ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. నిరసనకారులు విసిరిన రాళ్లు తగిలి అల్లు అర్జున్​ ఇంటి ఆవరణలో పూల కుండీలు, గార్డెన్​లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అర్జున్​ నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్​ సీపీని ఆదేశిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి

అల్లుఅర్జున్ ఇంటి వద్ద ఆందోళన - ఆరుగురికి పూచీకత్తు బెయిల్

ABOUT THE AUTHOR

...view details