తెలంగాణ

telangana

ETV Bharat / politics

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక - బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి - GRADUATE MLC BY POLL BJP CANDIDATE - GRADUATE MLC BY POLL BJP CANDIDATE

BJP Graduate MLC Candidate in Telangana 2024 : వరంగల్- ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ఎట్టకేలకు ప్రకటించింది. పార్టీ సీనియర్​ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Congress and BRS MLC Candidates in Telangana
Nalgonda Khammam Warangal MLC BY Election (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 2:07 PM IST

Graduate MLC By Poll BJP Candidate 2024: నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లోనూ ఆయన పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అందువల్ల ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

Warangal Nalgonda Khammam Graduate MLC BY Poll 2024: ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలు ఈ స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్​ అభ్యర్థి ఏనుగుల రాకేశ్​ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గత కొన్ని రోజులుగా కమలం పార్టీ అభ్యర్థి ఎవ్వరనే దానిపై తీవ్రంగా చర్చ జరిగింది. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ అయినందున ఎట్టకేలకు కాషాయ పార్టీ అధిష్ఠానం ఉత్కంఠకు తెరదింపింది. మే 9వ తేదీన నల్గొండలో ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - షెడ్యూలు విడుదల - Telangana Graduate MLC Elections

MLC BY Election in Telangana : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వంలో మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్‌ వేశారు. వీరితో కలిపి ఇప్పటివరకు నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. బీఆర్ఎస్​ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తరఫున ప్రతిపాదకులు నామినేషన్‌ దాఖలు చేయగా మంగళవారం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన మరోసెట్‌ నామినేషన్​ను వేశారు.

MLC Candidates Nominations in Telangana :శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్థులుగా పిడిశెట్టి రాజు, పూజారి సత్యనారాయణ, భీమా గుగులోతు, డాక్టర్‌ పెంచాల శ్రీనివాస్‌, కంటే సాయన్న, అల్వాల కనకరాజులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌. మహేందర్‌కు నామపత్రాలు అందజేశారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటు వేయనున్నారు.

కంటోన్మెంట్ బీఆర్ఎస్​ అభ్యర్థినిగా నివేదిత - అధికారికంగా ప్రకటించిన కేసీఆర్ - BRS Cantonment MLA Candidate

మహబూబ్​నగర్​ ఎమ్మెల్సీ రిజల్ట్​​పై హై టెన్షన్​ - నువ్వా నేనా అన్నట్లు హస్తం, కారు పార్టీలు - Mahabubnagar MLC By Election 2024

ABOUT THE AUTHOR

...view details