Bhatti and Deepak Munshi Meet CM Revanth Reddy : ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై చర్చించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇరువురు సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. వీరు సుమారు 30 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చలో ప్రధానంగా రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాలతో పాటు పెండింగ్లో ఉన్న మూడు లోక్సభ అభ్యర్ధుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్కు ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుల చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Congress Election Campaign in Telangana: మరోవైపు లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకు నెల రోజులు ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత జోరు పెంచింది. ఇప్పటికే ప్రచార రథాలను కాంగ్రెస్ ప్రారంభించింది. ఆయా లోక్సభ స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులు కార్యకర్తలతో జోష్ని నింపి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు.