Bandi Sanjay Fires on BRS Leaders : గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అని, అందువల్లే ప్రజలు ఆ పార్టీని రద్దు చేశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ఒక మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా, గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను అడ్డుకున్న భారత రాష్ట్ర సమితి నాయకులు, ఇప్పుడు గవర్నర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించినా, అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని దుయ్యబట్టారు.
గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలనుకుంటున్నారని, రాజ్యాంగానికి లోబడి పని చేసే వాళ్లు వాళ్లకు పనికిరారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్నే మార్చాలని అంబేడ్కర్‌ను అవమానించింది కేసీఆర్ కుటుంబమని దుయ్యబట్టారు. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్న దృష్ట్యా ఆయన కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్లేవారు : బండి సంజయ్
గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్. అందువల్లే ప్రజలు ఆ పార్టీని రద్దు చేశారు. ఒక మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా, గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను అడ్డుకున్న నాయకులు, ఇప్పుడు గవర్నర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించినా, అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. - బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యదర్శి