Bandi Sanjay Comments on Ponnam Prabhakar :రాష్ట్రంలో పదేళ్ల పాటు బీజేపీ అన్యాయం చేసిందంటూ ఈ నెల 14న కరీంనగర్లో దీక్ష చేపడతానన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం, మాజీ ఎంపీ వినోద్ కుమార్లపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పినందుకు మంత్రి పొన్నం గాంధీభవన్ వద్ద దీక్ష చేపట్టాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు ఒక్కనాడైనా పొన్నం దీక్ష చేయలేదని ప్రశ్నించారు.
ఇవాళ జగిత్యాలలో కథలాపూర్ మండలంలో పర్యటించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప, కొనుగోలు మాత్రం చేయడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు తప్పకుండా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(BRS) పాలనలో వడ్ల కొనుగోలుపై నానా అవస్థలు పడిన రైతులకు అండగా బీజేపీ నిలిచిందని తెలిపారు.
Bandi Sanjay on Congress :దేశాన్ని నాలుగు ముక్కలు చేసి విభజించిన మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్కు ప్రజలు ఎలా ఓటేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని అభ్యర్థి దొరకని కాంగ్రెస్, తనను ఓడించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. దేశంలో అభివృద్ధి కొనసాగాలని మళ్లీ ప్రధానిగా మోదీని ప్రజలు కోరుకుంటున్నారని, ఇవి ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయించే ఎన్నికలను చెప్పారు.