Arekapudi Gandhi Vs Kaushik Reddy :కౌశిక్‌రెడ్డి దొంగ అని గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బీఆర్‌ఎస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరు సరిగాలేదని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి తీరు వల్లనే బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి చెందిందని ఆరోపించారు. అతను కోవర్టుగా వ్యవహరించారని, అంతే కాకుండా ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని అరికెపూడి గాంధీ ధ్వజమెత్తారు. కౌశిక్ సవాల్‌ను స్వీకరించిన అరికెపూడి కొండాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
‘మీ ఇంటికొస్తా.. జెండా ఎగరేస్తా' అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన గాంధీ ఆయన రాకపోతే తానే స్వయంగా అతడి ఇంటికి వెళ్తానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే తన అనుచరులతో కలిసి అరికెపూడి గాంధీ కౌశిక్ ఇంటికి చేరారు. అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
పాడి వర్సెస్ గాంధీ : నేనే మీ ఇంటికి వస్తా - నీకు తట్టుకునే దమ్ముందా? : అరికెపూడి గాంధీ - Padi Kaushik Challenge To Arekapudi
కౌశిక్‌రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైఠాయించగా పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేశారు. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని, లేదంటే తననే లోపలికి పంపించాలని అరెకపూడి డిమాండ్ చేశారు. అతడి ఇంటి వద్ద బైఠాయించి అరెకపూడి అనుచరులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణనే లేదని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణకు ఎలా ఇస్తుంది? అని ప్రశ్నించారు. తనను హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని ఆరోపించారు. శుక్రవారం (సెప్టెంబరు 13వ తేదీ) 11 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ తడాఖా చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు ప్రతిచర్య ఉంటుందిన్నారు. అరెకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చారన్న కౌశిక్, తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని తెలిపారు.
స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నార్సింగి పీఎస్ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి మాట్లాడుతూ తనను ఆహ్వానిస్తేనే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లానని తెలిపారు. ఇంటిముందు కూర్చుంటే తమపై కౌశిక్‌రెడ్డి కుటుంబం దాడి చేసిందని ఆరోపించారు. కౌశిక్ భార్య ఇంటి పైనుంచి పూల కుండీలు మాపై విసిరేశారని అన్నారు. అదే బీఆర్ఎస్ విధానమైతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కాకుంటే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీ డిమాండ్ చేశారు.
నాడు కేసీఆర్ రైతును రాజు చేస్తే - నేడు కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తోంది : కేటీఆర్ - KTR tweet on cong govt Failures