Apple Company Sent Security Alert to Nara Lokesh :తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆపిల్ సంస్థ సెక్యూరిటీ అలెర్ట్ పంపింది. ఫోన్ హ్యాకింగ్, ట్యాపింగ్ ప్రయత్నం జరుగుతుందని లోకేశ్ ఫోన్‌కు ఆపిల్ నుంచి ఈమెయిల్ వచ్చిందని హెచ్చరించింది. ట్యాపింగ్, హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లోకేశ్‌కు సూచించింది.
Apple Company Sent Security Alert to Nara Lokesh లోకేశ్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కి పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆపిల్ అలెర్ట్ నోటిఫికేషన్‌తో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత అధికారులకు పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తమ ఫోన్లు జగన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని తెలుగుదేశం నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆపిప్ సంస్థ అలర్ట్‌తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకం కోల్పోవడంతో జగన్ ఫోన్ ట్యాపింగ్‌పై నమ్మకం పెట్టుకున్నాడని విమర్శించారు.
నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత - కేంద్ర హోం శాఖ నిర్ణయం - Lok Sabha Elections 2024
Apply Alert To Lokesh on Phone Hacking :ఈ వ్యవహారంపై మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్ సాయంతో లోకేశ్ ఫోన్‌ను (Phone Tapping Case in AP) ట్యాప్ చేసినట్లు సందేశాలు వచ్చాయని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి సందేశాలు గతంలో కూడా లోకేశ్‌కు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేకమార్లు ఈసి దృష్టికి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తన వాహనాన్ని పదే పదే తనిఖీ చేయడంపై లోకేశ్ అసహనం - అధికారుల తీరుపై అచ్చెన్న ఆగ్రహం - POLICE INSPECTED LOKESH CONVOY
Apply Security Warning To Nara Lokesh :గత రెండేళ్లుగా ఇంఛార్జ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నియామకం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీకి తొత్తుగా పని చేస్తున్నారని ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని వారి స్థానాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని కనకమేడల విజ్ఞప్తి చేశారు.
Lokesh Meeting with Amit Shah: అమిత్‌షాతో నారా లోకేశ్ భేటీ.. 'ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాం'..'సీఎం జగన్ కక్ష సాధిస్తున్నాడు..'