Amit Shah Telangana Tour Schedule 2024 : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28 రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. 1:50 గంటల నుంచి 2:40 వరకు మహబూబ్‌నగర్ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం చేయాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పండుగ వేళ అమిత్ షా కుటుంబంలో తీవ్ర విషాదం
మహబూబ్‌నగర్ క్లస్టర్ సమావేశం ముగించుకుని 2:55 గంటలకు కరీంనగర్ బయల్దేరుతారు. 3:55 గంటలకు కరీంనగర్‌కు చేరుకోనున్న షా, పట్టణంలో నిర్వహించే కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం కరీంనగర్ సమ్మేళనం ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో బీజేపా ఆధ్వర్యంలో నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 6:15 గంటల నుంచి 7:05 గంటల వరకు మహిళా మేధావులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం ఒక్క రోజు రాష్ట్ర పర్యటన ముగించుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7:45 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.