AP government against Narayan educational institutions : మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన ఖాతాలపై దృష్టి పెట్టిన నెల్లూరు పోలీసులు హైదరాబాద్ లోని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులకు లేఖలు రాశారు. హిమాయత్ నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన నాలుగు ఖాతాలను స్తంభింపజేయాలని కోరారు. పోలీసుల ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులు ఆ నాలుగు ఖాతాలను స్తంభింపజేశారు.
వైెస్సార్సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది - మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సోదాలపై టీడీపీ నేతలు
2023లో 92 బస్సుల కొనుగోలుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలతో నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ పునీత్ కోటప్ప కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నందున హిమాయత్ నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న ఖాతాల్లోని నిధులు దారి మళ్లించకుండా నియంత్రించేందుకు ఖాతాలను స్తంభింపజేయాలని నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులను ఆదేశిస్తూ లేఖలు రాశారు. పోలీసుల సూచనలతో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన నాలుగు ఖాతాలను స్తంభింపజేశారు.