తెలంగాణ

telangana

ETV Bharat / politics

దెబ్బకు దెబ్బ - ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - తిరిగి చెంప చెల్లుమనిపించిన ఓటర్ - VOTER SLAPS MLA IN AP - VOTER SLAPS MLA IN AP

MLA Slaps Voter in Guntur : నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఊహించని రీతిలో అవమానాల పాలయ్యాడు. పోలింగ్​ కేంద్రం వద్ద ఓటరుపై దాడి చేయగా సదరు ఓటరు తిరిగి ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ఆ వెంటనే ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి ఓటరుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.

MLA Beat Voter in Guntur
MLA Annabathuni Sivakumar Slaps Voter (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 12:11 PM IST

MLA Annabathuni Sivakumar Slaps Voter :ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. క్యూ లైన్​లో ఉన్న ఓటరు ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

ఓటరును కొట్టిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ (ETV Bharat)

గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఐతానగర్​లో ఓటు వేయడానికి వెళ్లారు. క్యూలైన్లో కాకుండా నేరుగా ఓటు వేయటానికి వెళ్తుండడంతో ఓ ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరును చెంపదెబ్బ కొట్టారు. రెప్పపాటు కాలంలో జరిగిన ఈ ఘటనతో ఓటర్ సైతం తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు ఓటర్​పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఓటర్లంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details