AP 10th Class Results 2024:పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 పాఠశాలలు జీరో శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఇందులో అత్యధికంగా 13 ప్రైవేటు పాఠశాలలు ఉండగా 3 ఎయిడెడ్ మరో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇక 4737 జడ్పీ ఉన్నత పాఠశాలలకు గాను 436 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. గతేడాది 38 పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు రాగా వాటిలో 22 ప్రైవేటు, 7 ఎయిడెడ్ మరో 5 జడ్పీ, 3 ఆశ్రమ, మరో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. నాడు-నేడు పనులతో పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పిన ప్రభుత్వం విద్యార్థుల సామర్థ్యాలను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.
మార్చి 18 నుంచి 30వరకు ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించగా ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్ష పత్రాల వాల్యుయేషన్ క్యాంపులు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 క్యాంపుల్లో మూల్యాంకనం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 6,156, 615 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రెగ్యులర్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 86.69% నమోదు కాగా, బాలురు 84.32%, బాలికలు 89.17% ఉత్తీర్ణత సాధించారు. బాలికల మొత్తం ఉత్తీర్ణత శాతం బాలుర కంటే 4.85% ఎక్కువగా నమోదైంది. 2803 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించగా, 17 పాఠశాలలు సున్నా (0) ఫలితాలు నమోదు చేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక శాతం అంటే 96.37% ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలవగా, అత్యల్పంగా కర్నూలు జిల్లా అంటే 62.47% ఫలితాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక రెసిడెన్షియల్, బీసీ సంక్షేమ పాఠశాలలు అత్యధికంగా 98.43% ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 616615మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 314610 బాలురు, 302005 బాలికలు ఉన్నారు.
Zero Results: 22 ప్రభుత్వ పాఠశాలల్లో 'సున్నా' ఫలితాలు.. దీనికి బాధ్యత ఎవరిది ?