Teleugu Desam Party Membership Crossed One Crore: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1 కోటి (1,00,52,598) దాటడం ఎంతో గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డు అని వెల్లడించారు. అసాధారణమైన ఈ లక్ష్యాన్ని చేరుకున్న వేళ, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత తనకు ఎనలేని సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ మహా క్రతువులో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తన అభినందనలు, ధన్యవాదాలు చెప్పారు.
కార్యకర్తల కష్టమే ఈ ఫలితమని స్పష్టం చేసారు. కోటి మంది పసుపు సైన్యంతో పార్టీని తీర్చిదిద్దిన కార్యకర్తే పార్టీకి అధినేత అని పేర్కొన్నారు. కార్యకర్తల పార్టీగా దినదిన ప్రవర్థమానమై తెలుగుదేశం వర్థిల్లుతోందన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. తెలుగు దేశాన్ని బలపరచడం అంటే రాష్ట్రాన్ని బలపరచడమేనని తెలిపారు. కార్యకర్తల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మరింతగా శ్రమించి పార్టీని, రాష్ట్రాన్ని సమున్నత స్థానంలో నిలిపేందుకు అనుక్షణం ప్రయత్నిస్తామని ఈ సంతోష సమయంలో అందరికీ మాట ఇచ్చారు.
'తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26' సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్ 26 న టీడీపీ అధినేత చంద్రబాబు గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1,00,52,598 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు.… pic.twitter.com/Upyo2u4boy
— Telugu Desam Party (@JaiTDP) January 16, 2025
పార్టీ జెండా మోసేది కార్యకర్తలే - వారిని నిత్యం గౌరవించాలి: నేతలతో చంద్రబాబు