ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో రెండు వర్గాల ఘర్షణ - ఏడుగురి పరిస్థితి విషమం - LAND DISPUTE IN MARRIPADU

మర్రిపాడు మండలం నాగినేనిగుంటలో ఉద్రిక్తత - ప్రభుత్వ భూమి విషయంలో రెండువర్గాల మధ్య దాడులు

Land Dispute in Marripadu
Land Dispute in Marripadu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2025, 10:42 PM IST

Land Dispute in Marripadu : నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మర్రిపాడు మండలం నాగినేనిగుంటలో ప్రభుత్వ భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. సాగు విషయంలో చెలరేగిన వివాదం కాస్తా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. గ్రామానికి చెందిన 332వ సర్వే నంబర్​లో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ పొలం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గత కొంత కాలంగా ఒక వర్గం ఆ భూమిని సాగు చేసుకుంటోంది. మరో వర్గం వారు ఇవాళ ట్రాక్టర్​తో భూమిని చదును చేసేందుకు యత్నించగా తాము మొదటి నుంచి సాగు చేస్తున్నామని వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక వర్గం వారిని మరో వర్గం ట్రాక్టర్​తో ఢీకొట్టింది. దీంతో కర్రలతో ప్రతిదాడులకు మరో వర్గం దిగింది. ఈ దాడుల్లో మహిళలతో సహా మొత్తం 12 మందికి గాయాలయ్యాయి.

వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భూవివాదం - మహిళా రైతు Vs రెవెన్యూ సిబ్బంది

భూవివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. గొడ్డలి, కర్రలతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.