CM Chandrababu Kanuma Wishes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం మనకు బోధిస్తుందని చెప్పారు. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనదని పేర్కొన్నారు. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వివరించారు.
రాష్ట్ర ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ… pic.twitter.com/SXk0py3WYc
— N Chandrababu Naidu (@ncbn) January 15, 2025
అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ అని లోకేశ్ అన్నారు. ఇళ్లు ధాన్యరాశులతో నిండుగా, పాడిపంటలతో పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పండగ అన్ని ప్రయత్నాల్లోనూ విజయం చేకూర్చాలని, ప్రజలంతా కుటుంబసభ్యులంతా కలిసి గొప్పగా కనుమ జరుపుకోవాలన్నారు. ఈ కనుమ పండుగ మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుతూ లోకేశ్ ట్వీట్ చేశారు.
తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ. రైతన్నలు ఏడాది పొడవునా తమ కష్టంలో పాలుపంచుకునే పశువులను పూజించే పండుగ కనుమ. మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా, పాడిపంటలతో పచ్చగా.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబసభ్యులంతా… pic.twitter.com/CRvGNv0xcM
— Lokesh Nara (@naralokesh) January 15, 2025
నారావారిపల్లెలో రెండోరోజు - తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు
నారావారిపల్లెలో సంక్రాంతి సందడి - పోటీల్లో పాల్గొన్న మహిళలకు కానుక