Happiness Hormones : మనుషుల సంతోషానికి నాలుగు హార్మోన్లు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మన సంతోషానికి కారణమైన ఎండార్ఫిన్స్, డోపమైన్, సెరొటోనిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లని అర్థం చేసుకోవడం చాలా అవసరం.
వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఎండార్ఫిన్స్ హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది. అందుకే మనం వ్యాయామాన్ని ఉల్లాసంగా పూర్తి చేసయడం వల్ల ఆనందం కలుగుతుంది. నవ్వినపుడు కూడా ఎండార్ఫిన్స్ విడుదలవుతుంది. రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా, హాస్యసంబంధిత విషయాలను చదవటం లేదా చూసినా రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తుందట.
Why Do We Feel Relax After Sex : సెక్స్ చేసిన తరువాత బాడీకి ఫుల్ రిలీఫ్.. ఎందుకో తెలుసా?
దైనందిన జీవితంలో అడపాదడపా చిన్నవో, పెద్దవో లక్ష్యాలను సాధిస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో తగినంత డోపమైన్ లభిస్తుంటుంది. మనకి ఇంటి పనుల్లోనో లేదంటే ఆఫీసులో బాస్ ప్రశంసలు దొరికినప్పుడు వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు. ఈ సమయంలోనే మనకు డోపమైన్ విడుదలవుతుంది. చాలా మంది గృహిణులు (house wives) ఆనందంగా లేకపోవడానికి ప్రధాన కారణం శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడమేనట. ప్రశంసల వల్ల డోపమైన్ విడుదలై వారిలో ఆనందం పరవళ్లు తొక్కుతుంది. అదే విధంగా కొత్తగా ఉద్యోగం దొరికినా, కారు, ఇల్లు, కొత్త కొత్త అధునాతన వస్తువులు కొన్నా సరే ఆయా సందర్భాల్లో డోపమైన్ విడుదలవుతుంది. అందుకే ఆనందంగా ఉంటాం. షాపింగ్ చేసినప్పుడు మనకి ఆనందంగా అనిపించడానికి గల ప్రధాన కారణం కూడా డోపమైన్ హార్మోనే!
మన వల్ల వేరొకరు ఆనందపడినప్పుడు, మనం వేరొకరికి ఉపకారం చేసినప్పుడు సెరెటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది. మనం ఎదుటి వారికి గానీ, ప్రకృతికి గానీ, సమాజానికి గానీ మంచి చేయగలిగినప్పుడు సెరిటోనిన్ విడుదల అవుతుంది. అంతేకాదు ఒకరి సమస్యలకు, ప్రశ్నలకు సలహాలు, సమాధానాలు బ్లాగ్స్ రూపంలోనో ఫేస్‌బుక్ గ్రూపుల రూపంలోనో ఇవ్వగలిగినప్పుడు కూడా ఈ సెరిటోనిన్ విడుదలై ఆనందంగా అనిపిస్తుంది. మన విలువైన సమయాన్ని మరొకరికి సాయం చేసేందుకు ఉపయోగించడం మనకి సంతోషాన్నిస్తుంది.
మనం తోటివారితో అనుబంధాన్ని పెంచుకుని వారికి దగ్గర అయినప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. మనం మన స్నేహితులు, కుటుంబసభ్యులను ఆలింగనం (hug) చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. శంకర్‌దాదా ఎంబీబీఎస్ అనే సినిమాలో చెప్పినట్టుగా ఒక ఆత్మీయ ఆలింగనం మంత్రం వేసినట్లుగా మాయ చేసి మనసుని కుదుటపరుస్తుంది. అదేవిధంగా కరచాలనం, భుజాల చుట్టూ చేయి వేసి భరోసా ఇవ్వటం కూడా చాలా ఆక్సిటోసిన్ హార్మోన్‌ని విడుదల చేస్తుంది.
రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎండార్ఫిన్స్, చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ డోపమైన్, తోటివారితో స్నేహంగా ఉంటూ సెరొటోనిన్ కోసం, మన పిల్లలను ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయులను దగ్గరకు తీసుకుంటూ ఆక్సిటోసిన్ హార్మోన్లను సాధించవచ్చు. ఈ నాలుగు హార్మోన్ల ద్వారా జీవించే పద్ధతి ని అలవాటుచేసుకుంటూ ఉంటే ఆనందంగా జీవించగలం. మనం సంతోషంగా ఉంటేనే మనం మన సమస్యలను చక్కగా పరిష్కరించుకొనే వీలుంది.
పిల్లలు చిరాకుగా ఉన్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని లాలిస్తే సంతోషంగా హుషారుగా ఉండగలరు. ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహిస్తే ఎండార్ఫిన్స్, బిడ్డల చిన్న పెద్ద విజయాలకు ప్రశంసించడం ద్వారా డోపమైన్, సాటివారిని కలుపుకొని వెళ్తే సెరొటోనిన్, పిల్లలను హత్తుకోవడం ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్లను సాధించుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
Stress Management Tips : తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నారా?.. ఈ చిట్కాలతో చెక్!