Huge Relief for Chandrababu in Supreme Court About Skill Case : ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది.
గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటి? అని ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది. సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరిని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను డిస్మిస్ చేసింది.
తొందరపాటు చర్యలు తీసుకోవద్దు - స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకి ఊరట - Skill Case Atchannaidu Bail
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ - ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీం