Brothers Died Of Heart Attack in Bapatla : రెండు రోజులు ఇంటిల్లిపాది సంతోషంగా పండగ సంబరాలు జరుపుకున్నారు. మూజో రోజు పండగను సంతోషంగా ముగించాలి అనుకున్నారు. కానీ వారొకటి తలిస్తే విధి మరోలా మారింది. పండగ పూట అన్నదమ్ముల మరణాలు ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.
అన్న మృతిని తట్టుకోలేక తమ్ముడు గుండె ఆగి మృతి చెందిన విషాద ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం గొల్లపాలెంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపాలెంకు చెందిన గంగాధర్ (40) వడ్రంగి పని చేస్తున్నాడు. ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన తమ్ముడు గోపి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
రోడ్డు గుంతపై నుంచి వెళ్లిన అంబులెన్స్ - కుదుపులతో బతికొచ్చిన మృతదేహం!
భరించలేక తమ్ముడు మృతి : కళ్లముందే పని చేస్తున్న వ్యక్తికి అలా కావడం, ఆసుపత్రికి తీసుకురాగా మరణించాడని తెలియడంతో సోదరడు గోపి భరించలేకపోయాడు. దీంతో ఆయనా కుప్పకూలిపోయాడు. వైద్యులు పరిశీలించి గోపి (33) గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. పండగ వేళ ఒకే ఇంట్లో అన్నదమ్ములు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.