Minister Nara Lokesh Gift To Brahmani in the Occasion of Sankranti : ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాంతి వేడుకల సందర్భంగా అపురూపమైన కానుక ఇచ్చారు. మంగళగిరిలో తయారు చేసిన చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతిచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు.
ఈ పోస్టును నారా బ్రాహ్మణి రీపోస్టు చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని చెబుతూ లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
Thank you, @naralokesh! This exquisite Mangalagiri saree is truly special, not just for its elegance but for its story of tradition and craftsmanship. It's a privilege to wear the work of our talented weavers. Wishing everyone a very Happy Sankranti filled with joy and… https://t.co/sbvj6sF9Wx
— Brahmani Nara (@brahmaninara) January 14, 2025
నారావారిపల్లెలో రెండోరోజు - తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు
నారావారిపల్లెలో దేవాంశ్ ఆటలు - మురిసిపోయిన చంద్రబాబు, భువనేశ్వరి