Wildfire In Texas : అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌ను కార్చిచ్చులు అతలాకుతలం చేశాయి. ఈ కార్చిచ్చు వల్ల 10 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు. పొలాలు. ఇళ్లు ఆహుతయ్యాయి.. కార్చిచ్చుల్లో అతి పెద్దదైన ది స్మోక్ హౌస్ క్రీక్ వల్ల టెక్సాస్‌లో ఇద్దరు మరణించారు.. హెంప్‌హిల్ ప్రాంతంలో భారీగా గృహాలు దహనమయ్యాయి.. అక్కడ 4 లక్షల ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి.. 1980 తర్వాత టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద కార్చిచ్చని అధికారులు తేల్చారు. డెలావేర్ రాష్ట్ర విస్తీర్ణానికి ఇది సమానం అని పేర్కొన్నారు.. గురువారం సాయంత్రం నాటికి పొరుగు రాష్ట్రమైన ఓక్లహామాలో ఈ కార్చిచ్చు 31 వేల500 ఎకరాలను దగ్ధం చేసింది.. వాతావరణం పొడిగా ఉండే సూచనలు కనిపిస్తుండటం వల్ల దావానలం ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితి లేదు.. మంటలు విస్తరించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.. 115 మైళ్లలో ఉన్న విద్యుత్తు తీగలను పునరుద్ధరించాలని వెల్లడించారు.. ప్రకృతి విపత్తుపై స్పందించిన దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రజలను రక్షించడానికి సాయశక్తులా కృషి చేయాలని అధికారులకు సూచించారు.. బాధితులకు అండగా ఉంటామని హామీ జో బైడెన్ హమీ ఇచ్చారు.. టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది. అగ్నితి ఆహుతైన వాహనాలు. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది