తెలంగాణ

telangana

ETV Bharat / photos

వేసవిలో హైడ్రేటెడ్​గా ఉండాలా? ఈ 5 'సూపర్​ ఫ్రూట్స్' తింటే చాలు! - Water Rich Fruits For Summer - WATER RICH FRUITS FOR SUMMER

Water Rich Fruits For Summer : వేసవిలో కాస్త ఎండలో నడిస్తే చాలు చాలా మందికి అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల మీ శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోండి. అందుకోసం నీరు ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల మీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడం సహా మీ బాడీని హైడ్రేటెడ్​గా ఉండొచ్చు. అలాంటి నీటి శాతం ఎక్కువ ఉండి వేసవిలో ఉపశమనాన్ని ఇచ్చే పండ్లు ఇవే.

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 6:30 AM IST

Water Rich Fruits For Summer : వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతూ ఉత్తేజపరిచే పండ్లు ఇవే.
ఎక్కువ నీరు ఉండే పండ్లలో వాటర్​మిలన్ (పుచ్చకాయ)మొదటి వరసలో ఉంటుంది. ఇందులో 90శాతం నీరు ఉంటుంది. ఈ పండు గుండె జబ్బులను నివారించడంలో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
స్ట్రాబెర్రీల్లో ఫ్లేవనాయిడ్స్​, ఫైటోన్యూట్రియెంట్లు, ఫైబర్​, విటమిన్​ సి, మాంగనీస్​, ఫోలేట్​, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణక్రియకు ఉపయోగపడతాయి.
శరీరాన్ని హైడ్రేట్​ చేసి ఉత్తేజపరిచే మరో పాపులర్​ ఫ్రూట్​ నారింజ. వ్యాయామాలు చేసేటప్పుడు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. వీటిలో కొలెస్ట్రాల్​ తగ్గుతుంది, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్​ సితో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
మస్క్​మిలన్​లో 90శాతం వరకు నీరు ఉంటుంది. దీని వల్ల శరీరం త్వరగా హైడ్రేట్​ అవుతుంది. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను దీంతో భర్తీ చేయొచ్చు.
లిచ్చిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం హైడ్రేటెడ్​గా ఉండటానికి సహాయం పడుతుంది. ఈ పండు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీన్ని జ్యూస్​ చేసుకుని తాగవచ్చు.

ABOUT THE AUTHOR

...view details