US Wildfire : అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. అక్కడ అందమైన బీచ్‌లను, హాలీవుడ్ స్టార్ల నివాసాలను, ప్రసిద్ధి గాంచిన ది పాలిసాడ్స్ ప్రాంతాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. వేలాది ఇళ్లు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. విమానాలు, హెలికాప్టర్లతో మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక దళాలు కృషి చేస్తున్నాయి. (Associated Press)