తెలంగాణ

telangana

ETV Bharat / photos

అమెరికాలో మరోసారి బద్ధలైన అగ్నిపర్వతం- ఎగసిపడుతున్న లావా - US VOLCANO ERUPTION

US Volcano Eruption : అమెరికా, హవాయిలోని బిగ్ ఐల్యాండ్‌లో కిలోవెయా అగ్నిపర్వతం బద్ధలైంది. దీనితో భారీగా లావా ఉబికివస్తోంది. కిలోవెయా విస్ఫోటనం చెందిన సమయంలో దాదాపు 260 అడుగుల ఎత్తు మేర లావా ఎగసిపడింది. ఆ ప్రాంతమంతా ఎర్రటి వర్ణాన్ని సంతరించుకుంది. అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ , ధూళి, విష వాయువులు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమీపంలోని ప్రజలను, జంతువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2024, 1:34 PM IST

అమెరికాలోని హవాయి ఐల్యాండ్స్‌లో కిలోవెయా అగ్నిపర్వతం విస్ఫోటనంతో, ఆ ప్రాంతమంతా ఎర్రటి వర్ణాన్ని తలపిస్తోంది. (Associated Press)
అగ్నిపర్వతం బద్ధలైన సమయంలో 260 అడుగుల ఎత్తు వరకు లావా ఎగసిపడింది. భూ ప్రకంపనలు వచ్చాయి. భారీగా పొగ, ధూళి, విషవాయువులు గాలిలోకి వెలువడ్డాయి. (Associated Press)
విస్ఫోటనం వల్ల సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతుందని అది వాతావరణంలోని ఇతర వాయువులతో కలసి ప్రతిస్పందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. (Associated Press)
ఈ ప్రమాదకర వాయువులు స్థానికులు, జంతువులను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. (Associated Press)
అగ్నిపర్వతం బద్ధలైన ప్రాంతాన్ని 2007లోనే సందర్శకులకు అనుమతి లేకుండా మూసివేశారు. (Associated Press)
అగ్నిపర్వతం సమీపంలోని క్రేటర్ల గోడలు అస్థిరంగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు నేలలో పగుళ్లు, రాళ్లు విరిగిపడటం మరిన్ని కారణాలుగా చెప్పారు. (Associated Press)
హవాయి వోల్కనోస్ నేషనల్ పార్క్‌లో ప్రపంచంలోని రెండు అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రస్తుతం బద్ధలైన కిలోవెయాతో పాటు మౌనా అగ్నిపర్వతం ఉంది. కిలోవెయా అగ్నిపర్వతం జూన్ , సెప్టెంబరు నెలల్లోనూ విస్ఫోటనం చెందింది. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details