Ayurvedic Treatment for Spots on Face: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ చర్మంపై ఏర్పడే కొన్ని మచ్చలు వారి సౌందర్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. చిన్నపిల్లలతోపాటు పెద్దల్లో వయసుతో సంబంధం లేకుండా ఇవి ముఖం, చేతులపై ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి. అనేక మందులు వాడినా ఫలితం లేక ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయుర్వేద పద్ధతిలో ఈ సమస్యకు పరిష్కారం ఉందని డాక్టర్ గాయత్రీ దేవి చెబుతున్నారు. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లల్లో మచ్చలు తగ్గించే ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు
- మూడు చిటికెల మిరియాల చూర్ణం
- మూడు చిటికెల టంకణ భస్మం
- పావు చెంచా పసుపు
- తగినంత తులసి రసం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో మిరియాల చూర్ణం, టంకణ భస్మం, పసుపు వేసి కలపాలి.
- ఆ తర్వాత ఇందులో తులసి రసం కలిపి లేపనంలా అయ్యేలా చేసుకోవాలి.
- ఈ లేపనాన్ని ప్రతి రోజూ తెల్లటి మచ్చలపై పొరలాగా వేసుకుని అరగంట పాటు ఉంచుకోవాలని వివరిస్తున్నారు.
తులసి రసం: తులసిలో మచ్చలను తొలగించే స్వభావం ఉంటుందని గాయత్రీ దేవి చెబుతున్నారు.
మిరియాలు: పిల్లలో తెల్ల మచ్చలు పోయి సాధారణ రంగు రావడంలో మిరియాలు సహాయ పడుతుందని చెబుతున్నారు.
పసుపు: పసుపులో యాంటీ బయాటిక్ గుణాలు పుష్కాలంగా ఉంటాయని అంటున్నారు. ఇది చర్మానికి మంచి టానిక్‌లాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
పెద్దల్లో మచ్చలు పోగొట్టే ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు
- పావు చెంచా లోధ్ర చూర్ణం
- పావు చెంచా యష్టి మధు చూర్ణం
- పావు చెంచా బార్లీ గింజల చూర్ణం
- తగినంత తేనె
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో లోధ్ర, యష్టి మధు, బార్లీ గింజల చూర్ణం తీసుకుని కలపాలి.
- ఆ తర్వాత లేపనంలా తయారు చేసుకునేందుకు తగినంత తేనెను కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒకసారి వేసుకోవాలని చెబుతున్నారు. మచ్చలు ఉన్న ప్రదేశంలో పూసుకుని అరగంట పాటు వేసుకోవాలని వివరిస్తున్నారు. ఇలా దీనిని సుమారు 3-4 నెలల పాటు లేపనంలా వాడుకోవాలని అంటున్నారు.
లోధ్ర: ప్రాచీన కాలంలోనూ చర్మ సౌందర్యానికి లోధ్రను వాడేవారని చెబుతున్నారు. మచ్చలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు.
యష్టి మధు: చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో యష్టి మధు సహాయ పడుతుందని చెబుతున్నారు.
బార్లీ: చర్మంపై ఉన్న మచ్చలను సహజంగానే తగ్గించేలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కపుల్ ఎక్సర్‌సైజుతో ఈజీగా బరువు తగ్గచ్చట! మరి ఎలా చేయాలో తెలుసా?
చెప్పులు లేకుండా నడుస్తున్నారా? హర్మోన్ ఇంబ్యాలెన్స్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు!