Headache When to see a Doctor : తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే ఏ పనీ చేయలేరు. కొందరికి గంటల్లో తగ్గిపోతే.. మరికొందరి రోజుల వరకూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్య వచ్చిపోయేదే అనుకొని లైట్ తీస్కుంటారు. కానీ.. తరచూ తలనొప్పి రావడం ఇతర అనారోగ్య సమస్యలకూ ఓ కారణం కావొచ్చని నిపుణులంటున్నారు. మరి.. తలనొప్పి గురించి ఎప్పుడు ఆందోళన చెందాలి ? ఎప్పుడు డాక్టర్ను కలవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఈ సమయంలో తలనొప్పిని లైట్ తీసుకోకండి!
- తీవ్రమైన తలనొప్పి, దగ్గు
- తరచూ తలనొప్పి
- జ్వరంగా ఉండి, మెడ బిగుసుకుపోయినట్లుగా అనిపించడం
- తలనొప్పితో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
- మూర్ఛ, మాటలు సరిగా రాకపోవడం
- నరాలు బలహీనంగా మారడం, సరిగా చూడలేకపోవడం
- తలనొప్పి కారణంగా చదవడం, పని చేయడం, నిద్రించడంలో ఆటంకాలు
- ఉదయాన్నే నిద్రలేచినప్పుడు తలనొప్పిగా అనిపించడం
- కళ్లు ఎర్రగా మారడం
- ఏదైనా ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి తలనొప్పి సమస్య వేధిస్తుంటే ఓ సారి మెడికల్ చెకప్ చేయించుకోవాలి.
- క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో తలనొప్పి సమస్య తీవ్రంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
తలనొప్పిలో రకాలు :
సాధారణంగా చాలా మందిలో ఏ అనారోగ్య సమస్యలు లేకుండా వచ్చే తలనొప్పి విశ్రాంతి తీసుకోవడం, కాఫీ/టీ తాగడం ద్వారా తగ్గిపోతుంది. అయితే, తలనొప్పిలో 300 కంటే ఎక్కువ రకాలున్నాయి. ఇందులో కేవలం 10 శాతం వాటికి మాత్రమే స్పష్టమైన కారణాలు తెలుసని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చీఫ్ మెడికల్ ఎడిటర్ డాక్టర్ హోవార్డ్ ఇ. లెవైన్ (Howard E. LeWine) తెలిపారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
ఒత్తిడి కారణంగా :
ఎక్కువమందికి ఒత్తిడి కారణంగా తలనొప్పి సమస్య వేధిస్తుంది. కొందరికి తలనొప్పితో పాటు భుజాలు, మెడ నొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది. నార్మల్గా ఇటువంటి తలనొప్పి 20 నుంచి రెండుగంటలలో తగ్గిపోతుందట! సరైన సమయానికి భోజనం చేయడం, యోగా వంటివి చేయడం ద్వారా తలనొప్పిని అధిగమించవచ్చు.
మైగ్రేన్ :
తలనొప్పిలోనే 'మైగ్రేన్' అనే మహా తలనొప్పి ఒకటి ఉంటుంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా? తలపై ఎవరైనా సుత్తులతో బాధుతున్నారా? అన్నంతగా నొప్పి వేధిస్తుంది. ముఖ్యంగా ఈ మైగ్రేన్ తలనొప్పి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, అలసట, నిద్ర లేకపోవడం లేదా అతిగా నిద్రపోవడం వంటివి మైగ్రేన్ తలనొప్పికి ప్రధాన కారణాలు.
- ఇంకా కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా తలనొప్పిగా అనిపిస్తుంది.
- కొందరు ఐస్క్రీమ్ వంటి చల్లటి పదార్థాలు తిన్నా కూడా తలనొప్పిగా ఉంటుంది.
- అలాగే కళ్లు ఎర్రబడి నీరు కారుతూ 'క్లస్టర్ తలనొప్పి' కొంతమందిని తీవ్రంగా బాధిస్తుందని డాక్టర్ హోవార్డ్ ఇ. లెవైన్ చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
శరీరం పంపే హెచ్చరికలను గుర్తించారా? ఈ రోగాలు వస్తాయని బాడీ ముందే చెప్పేస్తుందట! అవేంటో తెలుసా?
నిద్రలేమితో బాధపడుతున్నారా? - నైట్ పడుకునే ముందు ఈ ఆహారం తింటే హాయిగా నిద్ర పడుతుందట!