Mumbai Indians Highest Wicket Takers : ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు ఎవరంటే ?. ముంబయి తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ పొజిషన్లో శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ఉన్నాడు. ఈయన 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/13.. ప్రస్తుత సీజన్లోనూ అదరగొడుతున్న ముంబయి ఇండియన్స్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు ఈ జట్టు తరఫున ఆడిన 124 మ్యాచుల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకుని రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.. దిగ్గజ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ లిస్ట్‌లో 127 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.. ముంబయి తరఫున మిచెల్ మెక్ క్లెనాగన్ 71 వికెట్లు తీసి నాలుగో స్థానంలో నిలిచాడు. అతడి బౌలింగ్ గణాంకాలు 4/21.. అనేక మ్యాచుల్లో ముంబయి జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించిన కీరన్ పొలార్డ్. ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇప్పటి వరకు 69 వికెట్లు తీశాడు.