తెలంగాణ

telangana

ETV Bharat / photos

కుంభమేళాలో ఒక్క రోజే 6 కోట్ల మంది పుణ్య స్నానాలు! - MAHA KUMBH 2025

Maha Kumbh 2025 Devotees : మౌని అమావాస్య సందర్భంగా భక్తులు త్రివేణిసంగమంలో అమృతస్నానాలు ఆచరిస్తున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము భక్తుల రాకమొదలైంది. ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి. మధ్యాహ్నం మూడు గంటలకే 5.7 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై గులాబీ పూలవర్షం కురిపించారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 6:58 PM IST

మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. (Associated Press)
తెల్లవారుజాము నుంచే ఘాట్లకు చేరుకోవటం మొదలైంది. (Associated Press)
ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి. (Associated Press)
మౌని అమవాస్య సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకే 3.61 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. (Associated Press)
బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 5.71 కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమంలో అమృత్​ స్నానం ఆచరించినట్లు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. (Associated Press)
ఇప్పటివరకు మొత్తం 19.94 కోట్ల మందిపైగా భక్తులు కుంభమేళా వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. (Associated Press)
మౌని అమావాస్య సందర్భంగా పలువురు ప్రముఖులు, దేశంలోని 4మఠాలకు చెందిన శంకరాచార్యులు త్రివేణి సంగమానికి చేరుకుని అమృతస్నానం ఆచరించారు. (Associated Press)
మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఊరేగింపుగా వెళ్లి అఖాడాలు అమృత స్నానం చేశారు. (Associated Press)
మౌని అమావాస్య సందర్భంగా యూపీ ప్రభుత్వంహెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల గులాబీ పూలవర్షం కురిపించింది. (Associated Press)
భక్తుల రద్దీ దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు వారికి కొన్ని సూచనలు జారీచేశారు. (Associated Press)
ఎప్పటికప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details