తెలంగాణ

telangana

ETV Bharat / photos

సేమ్​ సెక్స్​ మ్యారేజ్​ ఇక లీగల్- ఒకేరోజు వందల పెళ్లిళ్లు - SAME SEX MARRIAGE THAILAND

Same Sex Marriage Thailand : థాయ్​లాండ్​లో గురువారం స్వలింగ సంపర్కుల వివాహ సమానత్వ చట్టం అమలులోకి వచ్చింది. దీంతో దాదాపు 300జంటలు బ్యాంకాక్​లో తమ వివాహాన్ని అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ కొత్త చట్టంపై స్వలింగ సంపర్క జంటలు సంతోషం వ్యక్తం చేశారు. తమ వివాహానికి చట్టపరంగా గుర్తింపు భవిష్యత్ ఆందోళనలను తగ్గిస్తుందని చెప్పారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 5:31 PM IST

థాయ్​లాండ్​లో దాదాపు 300 స్వలింగ సంపర్కుల జంటలు ఒకేసారి వారి విహాహాన్ని చట్టబద్ధం చేసుకున్నాయి. (Associated Press)
వివాహ సమానత్వ చట్టం అమలులోకి రావడం వల్ల గురువారం బ్యాంకాక్​లోని ఓ షాపింగ్​ మాల్​ ఎగ్జిబిషన్​ హాల్​లో రిజిస్ట్రేషన్​కు సంబంధించిన ఫార్మాలిటీస్​ను పూర్తి చేశారు. సాధారణంగా వివాహాల రిజిస్ట్రేషన్​ను జిల్లా కార్యాలయాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. (Associated Press)
దేశవ్యాప్తంగా ఇంకా వందలాది మంది తమ వివాహాన్ని రిజిస్టర్​ చేసుకుంటారని అంచానా. (Associated Press)
థాయ్​లాండ్​లో సివిల్ అండ్ కమర్షియల్ కోడ్​కు సవరణలు చేశారు. 'పురుషులు, మహిళలు' అని ఉన్న చోట 'వ్యక్తులు' అని- 'భర్త, భార్య' అని ఉన్న చోట ' వివాహ భాగస్వాములు' అని మార్చారు. (Associated Press)
LGBTQ+ జంటలకు పూర్తి చట్టపరమైన ఆర్థిక, వైద్య హక్కులు లభించడానికి ఈ చట్టం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. (Associated Press)
ఈ చట్టం ప్రకారం- ఉమ్మడి ఆస్తులు, పన్ను సంబంధిత బాధ్యతలు, వారసత్వ హక్కులు, సర్వైవర్ బెనిఫిట్స్​లో భాగస్వాములకు సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. (Associated Press)
స్వలింగ సంపర్కులకు సమాన హక్కులు కల్పించిన తొలి ఆగ్నేయాసియా, మూడో ఆసియా దేశంగా థాయ్​లాండ్ నిలిచింది. (Associated Press)
థాయ్​లాండ్​లో అమల్లోకి వచ్చి కొత్త చట్టంపై ఓ స్వలింగ సంపర్క జంట సంతోషం వ్యక్తం చేసింది. దీనివల్ల లింగ భేదం లేకుండా ప్రతి అంశంలోనూ అందరూ ఒకే ప్రాథమిక హక్కులను పంచుకుంటారని రుజువు చేస్తుందన్నారు. (Associated Press)
తాము ఎవరో- అలాగే ప్రేమించే, తాము ప్రేమించే వ్యక్తిని అంగీకరించే సోషల్​ సర్కిల్, స్నేహితులు, కుటుంబం తమకు ఉందని మరో జంట తెలిపింది. (Associated Press)
అయితే పెళ్లి అనేది మనకు భావోద్వేగపరంగా ప్రతీదాన్ని సంతృప్తిపరిచేది కాదని అభిప్రాయపడ్డారు. (Associated Press)
చివరికి, ఇద్దరు మనుషులుగా, తమకు సాధారణ జంటలలాగానే ప్రాథమిక చట్టపరమైన హక్కులు ఉండాలని నమ్ముతున్నట్లు తెలిపారు. తాము కూడా కుటుంబం లాగానే అని, కానీ చట్టపరంగా గుర్తింపు భవిష్యత్ ఆందోళనలను తగ్గిస్తుందని తెలిపారు. (Associated Press)
థాయ్​లాండ్​లో LGBTQ+ కమ్యూనిటీ సభ్యులు ఎదుర్కొంటున్న వివక్షకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలు చాలా పోరాడారు. అలాంటి వారికి కూడా వివాహ సమానత్వ చట్టాన్ని అమలు చేసేందుకు దశాబ్దాలుగా కష్టపడ్డారు. (Associated Press)
అయితే ఈ మార్పునకు సమాజం సిద్ధంగా ఉందని, కానీ అధికారుల అవగాహన చేసుకోవడం, రంపంలో విరిగిపోయిన భాగం లాంటిదని బ్యాంకాక్​ డిప్యూటీ గవర్నర్​ సనన్ వాంగ్​స్రాంగ్​బూన్ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. (Associated Press)
థాయ్​లాండ్​లో అమల్లోకి వచ్చిన స్వలింగ సంపర్కుల వివాహ సమానత్వ చట్టం (Associated Press)

ABOUT THE AUTHOR

...view details