తెలంగాణ

telangana

ETV Bharat / photos

యుద్ధంతో ఇజ్రాయెల్ ఎకానమీ ఢమాల్! ప్రభుత్వంపై నిరాశ్రయుల భారం- కోలుకోవడం సవాలే!

Israel Economy : హమాస్‌, హెజ్‌బొల్లా మిలిటెంట్‌ సంస్థలతో చేస్తున్న యుద్ధం ఇజ్రాయెల్‌పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. దేశంలో పెట్టుబడుల రాక భారీగా తగ్గిపోగా ఆర్థిక వృద్ధిరేటు స్తంభించింది. గత ఏడాది మిలిటరీపై ఇజ్రాయెల్‌ 27.5 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. తక్కువ జనాభా కలిగి ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చు విషయంలో ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్‌ 15వ స్థానంలో ఉంది. (Associated Press, ANI)

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

హమాస్‌, హెజ్‌బొల్లా మిలిటెంట్‌ సంస్థలతో ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంతో ఆ దేశానికి ఖర్చు తడిసిమోపడవుతోంది. ఇజ్రాయెల్‌ ఆర్థిక వ్యవస్థపై ఇది దీర్ఘకాలం ప్రభావం చూపే అవకాశం ఉంది. (Associated Press, ANI)
యుద్ధం కారణంగా మిలిటరీ ఖర్చు భారీగా పెరగ్గా మరోవైపు వృద్ధిరేటు నెమ్మదించింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. (Associated Press)
యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌కు పెట్టుబడుల రాక తగ్గిపోయింది. పన్నులు అధికమయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఖర్చుపెట్టాలా లేదా యుద్ధం కోసమా అని ఎంచుకోవాల్సిన పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంది. (Associated Press)
2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేయక ముందు నెలకు 1.8బిలియన్‌ డాలర్లను మిలిటరీ కోసం ఇజ్రాయెల్‌ ఖర్చు చేసేది. గత ఏడాది చివరినాటికి ఆ ఖర్చు 4.7బిలియన్‌ డాలర్లకు పెరిగింది. (Associated Press)
గత ఏడాది మిలిటరీపై ఇజ్రాయెల్‌ 27.5 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. ఈ విషయంలో ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్‌ 15వ స్థానంలో ఉంది. (Associated Press)
ఇజ్రాయెల్‌ జీడీపీలో మిలిటరీ ఖర్చు 5.3 శాతంగా ఉంది. అదే అమెరికాకు 3.4 శాతం, జర్మనీకి 1.5శాతంగా ఉంది. ఉక్రెయిన్‌ మాత్రం తన జీడీపీలో 37 శాతం రష్యాతో పోరాటానికే ఖర్చు చేస్తోంది. (Getty Images)
యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ వృద్ధిరేటు మందగించడమే కాకుండా కార్మికుల సరఫరాపై తీవ్రప్రభావం పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇజ్రాయెల్‌ వృద్ధిరేటు 4శాతంగా నమోదవగా రెండో త్రైమాసికంలో అది 0.2 శాతానికి పడిపోయింది. (Associated Press)
గాజా, లెబనాన్‌ నుంచి రాకెట్ల వర్షం కురియడం వల్ల ఆయా ప్రాంతాలతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. (Associated Press)
యుద్ధం కారణంగా తమ ఇళ్లను ఖాళీ చేసినవారికి వసతి ఖర్చును ఇజ్రాయెల్‌ భరిస్తోంది. 2006లో హెజ్‌బొల్లాతో జరిగిన యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌ ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకుంది. అప్పట్లో ఆయుద్ధం కేవలం 34రోజులే సాగింది. (Associated Press)
ఏటా 3.8 బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయాన్ని ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తోంది. ఇది ఏడాదికి ఇజ్రాయెల్‌ చేస్తున్న మిలిటరీ ఖర్చులో 14 శాతం కావడం గమనార్హం. (ANI)
ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం అమెరికా రక్షణ రంగ కంపెనీలకే వెళ్తున్నాయి. గాజాలో యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్‌కు సాయం రూపంలో అమెరికా 17.9 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. (Associated Press)
మరోవైపు ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులతో గాజాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ 90 శాతం మంది తమ నివాసాలను వీడాల్సి వచ్చింది. (Associated Press)
గాజాలో ఎటు చూసినా నిరుద్యోగం, విధ్వంసమే దర్శనమిస్తోంది. యుద్ధం కారణంగా వెస్ట్‌బ్యాంక్‌లో వేలాది మంది పాలస్తీనియన్లు ఉద్యోగాలు కోల్పోయారు. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details