తెలంగాణ

telangana

ETV Bharat / photos

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ఈ కోట్స్​తో మీ జీవితంలో ముఖ్యమైన వారికి విషెస్​ చెప్పండి! - international womens day

International Womens Day 2024 : ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ పాత్ర ఎంతో కొంత ఉంటుంది. అది తల్లిగా, చెల్లిగా, భార్యగా, అక్కగా, స్నేహితురాలిగా.. ఇలా ఏదో రూపానా ఉంటారు. మరి అలాంటి వారి పట్ల మీ కృతజ్ఞత, అభిమానాన్ని తెలియజేయడానికి మహిళా దినోత్సవం బెస్ట్​. వారు మీకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ వారికి మెసేజ్ రూపంలో విషెస్​ చెప్పాలనుకుంటే "ఈటీవీ భారత్​" మీకు స్పెషల్​ కోట్స్​ అందిస్తోంది.

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 3:05 PM IST

"కన్నతల్లిగా లాలిస్తావు.. కంటికి రెప్పాలా రక్షిస్తావు.. కల్మషం లేని ప్రేమను అందిస్తావు.. చివరి శ్వాస వరకూ ప్రేమిస్తావు" ఓ తల్లీ నీకు వందనం! హ్యాపీ ఇంటర్నేషనల్​ ఉమెన్స్‌ డే
''జననం నీవే- గమనం నీవే కర్తవు నీవే- కర్మవు నీవే సృష్టివి నీవే- ప్రతిసృష్టివి నీవే ఓ మహిళా నీకు పాదాభి వందనం'' -హ్యాపీ ఉమెన్స్‌ డే !!
"స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు.. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు.. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు" -అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభకాంక్షలు
"తల్లిని పూజించు.. సోదరిని దీవించు.. భార్యను ప్రేమించు.. ప్రతీ మహిళను గౌరవించు" అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
"ఆడపిల్ల అని ఎన్నటికీ దిగులు చెందకూ.. ఆడపులిలా అన్నింటినీ ఎందురించూ.. ఆడపిల్లగా పుట్టినందుకు గర్వించూ"! -మహిళ దినోత్సవ శుభకాంక్షలు
"అవకాశాలను అందిపుచ్చుకోండి.. ఆటుపోట్లను అధిగమించండి.. ఆకాశమే హద్దుగా జీవించండి" అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !
"కుటుంబమే తన ఆలోచన.. కుటుంబమే తన ఆవేదన.. కుటుంబమే తన ఆరాధానగా భావించే మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్‌ డే"
"కష్టాలు కన్నీళ్లను దిగమింగుకుని.. కుటుంబం కోసం అహర్నిషలు కష్టపడే మహిళలందరికీ" - హ్యాపీ ఉమెన్స్ డే!
"అమ్మగా ఇంటిని చక్క దిద్దగలవు.. భార్యగా ప్రేమనూ పంచగలవు.. చివరి శ్వాస వరకూ స్వచ్ఛమైన ప్రేమను అందిచగలవు"! మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
"కొవ్వొత్తిలా కరుగుతూ.. కుటుంబానికి వెలుగునిస్తూ.. కన్నీళ్లనే దాహంగా తీర్చుకుంటూ.. కుటుంబమే సర్వస్వంగా జీవించే మహిళలందరికీ.. హ్యపీ ఉమెన్స్‌ డే 2024!!"

ABOUT THE AUTHOR

...view details