తెలంగాణ

telangana

భారత స్వాతంత్య్ర దినోత్సవం - మీకోసం అద్భుతమైన వాట్సాప్ స్టేటస్​ కోట్స్, గ్రీటింగ్స్! - independence day 2024 wishes

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 11:38 AM IST

Independence Day 2024 : ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా ఇండిపెండెన్స్ డే ఉత్సవాలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది. ఈ జెండా పండగ వేళ.. మీ ఆత్మీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను ప్రత్యేకంగా తెలపండి. వాట్సాప్​ కోట్స్​ను షేర్ చేయండి. (ETV Bharat)
ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశం మేల్కొంటుంది.. రేపటి ఉషోదయం కోసం.. స్వేచ్ఛాస్వాతంత్య్రాల సంబరాలకోసం.. - స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)
మన చరిత్ర మహోజ్వలం.. మన వారసత్వం మహోన్నతం.. భారతీయుడిగా పుట్టినందుకు గర్వించు - స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)
దేశంలో మీరు కోరుకునే మార్పు మీనుంచే మొదలు పెట్టండి.. మీరే నాయకుడిగా మార్గనిర్దేశం చేయండి - స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)
మీ రక్తం మరగకపోతే.. అది నెత్తురు కాదు నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే నువ్వు భారతీయుడివి కాదు - చంద్రశేఖర్ ఆజాద్ (ETV Bharat)
స్వాతంత్య్రం వచ్చెననీ సంబరపడిపోతే సరిపోదోయి.. సాగవోయి ప్రగతి దారులా.. - శ్రీ శ్రీ (ETV Bharat)
గగన సిగన ఎగరాలి మన మువ్వన్నెల జెండా.. దేశభక్తి ఎదగాలి మన గుండెల నిండా.. - స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)
జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్నీ ప్రేమిస్తాం.. ఉరికంభాన్ని ఎగతాళి చేస్తాం.. నిప్పురవ్వలపై నిదురిస్తాం - భగత్ సింగ్ (ETV Bharat)
దేశం మీద నాకున్న బాధ్యతకు హద్దుల్లేవ్.. భారతజాతి మీద నాకున్న ప్రేమకు కొలమానాల్లేవ్. భారత్ మాతాకీ జై - స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)
కంటికి కన్ను సిద్ధాంతం అనుసరిస్తే.. ప్రపంచమంతా అంధత్వంలో మునిగిపోతుంది - మహాత్మా గాంధీ (ETV Bharat)
మనమంతా భరతమాత బిడ్డలం.. మన తత్వం భిన్నత్వంలో ఏకత్వం - స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details