మనం ఎంత కఠినంగా వ్యవహరించినా కొన్ని ఆహార పదార్థాలను చూస్తే నోరూరుతుంది. కానీ ఇలా చేయడం వల్ల దాని నుంచి తప్పించుకోవచ్చు.. కొన్నిసార్లు దాహాన్ని మనం ఆకలిగా పొరపడతాం. అకస్మాత్తుగా ఏదన్నా తినాలని అనిపిస్తే ముందు కొన్ని మంచినీటిని తాగండి. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఆకలిని అరికట్టడమే కాకుండా బరువు తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఏదైనా తినేటప్పుడు ప్రోటీన్‌కు ప్రాముఖ్యం ఇవ్వండి. ఇవి త్వరగా పొట్టను నింపి తృప్తిగా తిన్న అనుభూతిని ఇస్తాయి. ప్రోటీన్ వినియోగం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. అతిగా తినాలన్న ఆశ పోయి బరువు తగ్గుతారు.. నడక లేదా స్నానం చేయడం వంటి ఏదైనా పని చేస్తూ ఆహారం పైనుంచి మీ దృష్టి మరల్చడానికి ప్రయత్నించండి. పరిసరాలు. ఆలోచనలను మార్చుకోవడం తినాలన్న కోరికను అరికట్టడంలో సహాయపడుతుంది. చూయింగ్‌గమ్ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించే హార్మోన్‌లకు నిద్రలేమి అంతరాయం కలిగిస్తుంది. ఇది తినాలన్న బలమైన కోరికకు దారి తీస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవారు ఊబకాయం బారినపడే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోవడం వల్ల తినాలన్న వ్యామోహం తగ్గుతుంది.. పిండి పదార్థాలు. విటమిన్లు. ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో విపరీతమైన ఆకలి అనిపించదు. చిరుతిండి కావాలనిపించినా పండ్లు. నట్స్. కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోండి.