గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.. వరదల వల్ల ఇప్పటి వరకు 112 మంది మృతి చెందగా. 100 మంది పైగా గాయపడ్డారు.. వరదలు వల్ల కవ్రేపాలన్‌చౌక్‌లోనే 34. లలిత్‌పుర్‌లో 20. ఖాఠ్‌మాండూలో 12 మంది మరణించారు.. దేశవ్యాప్తంగా అనేక ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో జనజీవనం స్తంభించింది.. బాధిత ప్రాంతాల్లో దాదాపు 3.000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.. నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన 1.947 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.. వరద ప్రభావ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 23 రాఫ్టింగ్ బోట్లను ఉపయోగిస్తున్నారు.. ఇప్పటి వరకు 760 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. ఈ ఆకస్మిక వరదల వల్ల . ఖాఠ్‌మాండూ లోయ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.. వరదల వల్ల నీట మునిగిన ఇళ్లు. నేపాల్‌లో వరద బీభత్సం