వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నబీల్ అఫ్రిది.. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్స్ చేయడం మొదలు పెట్టి సోషల్‌మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ఇతడికి యూట్యూబ్‌లో 16 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉండగా.. ఇన్‌స్టాలో ఫాలోవర్లు 6 లక్షలకు పైనే ఉన్నారు.. బిగ్‌బాస్‌లో ఉన్న నబీల్.. తాజాగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. తనతో పాటు వీడియోల్లో నటించిన ఆద్యా రెడ్డి అనే అమ్మాయితో ప్రేమ విషయాన్ని రివీల్ చేశాడు.. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఫొటోలు పోస్ట్ చేసి తన ప్రేమను తెలియజేశాడు.. అతడు పెట్టిన పోస్టులకు "థ్యాంక్యూ సో మచ్ హీరో" అంటూ ఆమె కూడా రిప్లై ఇచ్చింది.. అంతేకాదు నబీల్‌కు సపోర్ట్ చేయమని ఇన్‌స్టాలో పలు వీడియోలు కూడా ఈమె షేర్ చేస్తోంది. దీంతో.. వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని చాలా మంది ఫిక్స్ అవుతున్నారు.