Visakhapatnam Railway Station Incident : విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఉదయం 5.20 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు తిరునల్వేలి-పురిలియా రైలు వచ్చింది. తొలగించిన రైలు ఇంజిన్ ముందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగాయి. దీంతో రైలు ఇంజిన్ విద్యుత్ తీగలను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరాను ఆపివేశారు. విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ తీగల పునరుద్ధరణ పనులను డీఆర్ఎం మనోజ్ సాహూ పరిశీలిస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రైల్వే అధికారుల వివరణ : విశాఖ రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనపై రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరగలేదని తూర్పు కోస్తా రైల్వే స్పష్టీకరణ ఇచ్చింది. నిర్వహణలో భాగంగా మూడో నంబరు ప్లాట్‌ఫారంపై విద్యుత్ తీగలు మారుస్తున్నారని అధికారులు తెలిపారు. స్టేషన్లో ఓవర్‌హెడ్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. రైళ్ల రాకపోకలు యథావిధిగా నడుస్తున్నాయని తూర్పు కోస్తా రైల్వే స్పష్టం చేసింది.
రైలు ప్రయాణికులకు అలర్ట్ - తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 24 రైళ్లు రద్దు
ఉప్పల్ రైల్వే స్టేషన్ సిగ్నల్స్‌లో సమస్య - నిలిచిపోయిన పలు రైళ్లు