America Tornado 2024 : అమెరికాలో టొర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓక్లహోమా రాష్ట్రంలో భీకరమైన సుడిగాలుల ధాటికి నలుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. భారీగాలులకు వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 33 వేల. గృహాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. ఓక్లహోమాలోని 12 కౌంటీల్లో అధికారులు అత్యయిక స్థితి ప్రకటించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.