Vidudalai Part 2 Extended Version : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'విడుదల పార్ట్ 2'. వెట్రిమారన్ రూపొందించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని భాషల్లో ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రజాదళం నాయకుడు, నక్సల్ పెరుమాళ్ అలియాస్ మాస్టర్ రోల్‌లో విజయ్ యాక్టింగ్ అభిమానులు తెగ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ సేతుపతి, వెట్రిమారన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'విడుదల పార్ట్ 2' ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను అభిమానులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
"విడుదల పార్ట్ 2' ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను మూవీ లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. థియేటర్ వెర్షన్‌కు దాదాపు గంట నిడివి ఉన్న ఫుటేజ్‌ను యాడ్ చేసి దాన్ని ఓటీటీలో రిలీజ్ చేయనున్నాం. యూఎస్ వెర్షన్ ప్రింట్, మన ప్రింట్‌కు మధ్య రన్‌టైమ్ విషయంలో సుమారు ఎనిమిది నిమిషాల డిఫరెన్స్ ఉంటుంది. అందుకే చివరి నిమిషంలో మన ప్రింట్‌లో ఆ ఫుటేజ్‌ను తొలగించాల్సి వచ్చింది. చెప్పాలంటే విడుదల పార్ట్ 1, 2 మొత్తం ఫుటేజ్ నిడివి సుమారు 8 గంటలు ఉంటుంది. దీన్ని థియేటర్ వెర్షన్‌కు అనుగుణంగా కట్ చేసి విడుదల చేశాం" అని వెట్రిమారన్ తెలిపారు.
ఇక 'విడుదల 2' విషయానికి వస్తే, పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం గతేడాది విడుదలైన 'విడుదల'కు కొనసాగింపుగా మేకర్స్ రూపొందించారు. పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టర్ పెరుమాళ్ జమిందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో ఓ దళ నాయకుడిగా ఎలా మారాడు? తన ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి (మంజు వారియర్)తో తనకు చిగురించిన ప్రేమ ఆయన్ను ఏ వైపు నడిపించింది? అహింసను ఇష్టపడే పెరుమాళ్ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలోనే నడిపించడానికి గల పరిస్థితులేంటి? నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించి పెరుమాళ్‌ను పట్టించినందుకు కానిస్టేబుల్ సూరికి ఎటువంటి ఫలితం దక్కింది? ఇటువంటి ఆసక్తికర ప్రశ్నలతో పార్ట్ 2 సాగింది.
విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఖాతాలో అరుదైన ఘనత
చైనాలో రిలీజ్‌కు సిద్ధమైన విజయ్ సేతుపతి సినిమా - ఏకంగా 40 వేల థియేటర్లలో!