ETV Bharat / spiritual

ఆ రాశివారు కష్టపడి పని చేస్తే ఉజ్వల భవిష్యత్‌ గ్యారెంటీ - శ్రీలక్ష్మీ గణపతి ప్రార్థన శుభప్రదం! - HOROSCOPE TODAY

2024 డిసెంబర్​ 22వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2024, 5:00 AM IST

Horoscope Today December 22nd 2024 : డిసెంబర్​ 22వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందు చూపుతో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులను సంప్రదించడం తప్పనిసరి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. రుణభారం తగ్గుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివ పంచాక్షరీ మంత్రం జపం మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కోర్టు సమస్యలు, కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. స్థిర, చరాస్థుల కొనుగోలు వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. నిరాశావాదాన్ని వీడి ఆశావాదులుగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా ఉత్సాహంతో పనిచేస్తే సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు విజేతలు అవుతారు. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. వృత్తి, వ్యాపారాలలో రాణిస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మ విశ్వాసంతో పని చేసి విజయాన్ని అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కీలక వ్యవహారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. మీ నిర్ణయ శక్తికి, నాయకత్వ శక్తులకు పురస్కారాలు లభిస్తాయి. మీరు ఏ సమస్యలైనా క్షణాల మీద పరిష్కరించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం వల్ల మీకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పనులు సులువుగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. మీ బలహీనత మీ శత్రువులకు బలంగా మారే ప్రమాదముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గొడవలు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రియమైన వారిని నొప్పించకుండా మాట్లాడటం మంచిది. వృధా ఖర్చులు ఆర్థిక స్థితిని ప్రమాదంలో నెట్టవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కుటుంబ కలహాలు ఏర్పడుతాయి. ఉన్నతాధికారులతో చేసే కీలక చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఒక తిరుగులేని రోజు. అద్భుతమైన ధనలాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు, పనులు సమయానికి పూర్తవడం, వ్యాపారాల్లో విజయం సులభంగా చేకూరుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు ఖరారు చేసుకోవడానికి ఇది మంచిరోజు. ఈ రోజంతా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఏర్పడే సమస్యలు పరిష్కారం కష్టతరంగా ఉంటుంది. దైవ దర్శనం, ధార్మిక కార్యకలాపాలు మీకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. అనారోగ్యం కారణంగా అత్యుత్తమ పనితీరును కనబరచకపోవచ్చు. పని ప్రదేశంలో సహచరులతో విభేదాలు ఏర్పడవచ్చు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సూర్యాష్టకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు కోసం తీవ్రంగా శ్రమించాలి. అనవసర చికాకులు తగ్గించుకోండి. కోపం మీద అదుపు ఉంటే మంచిది. ఆర్థిక సమస్యలు తీవ్రం కావడం వల్ల దిగులుగా ఉంటారు. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. యోగా, ధ్యానం ప్రతికూల ఆలోచనలు, ఒత్తిడిని దూరం చేస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శని స్తోత్రం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మనోబలంతో, చిత్తశుద్ధితో అనుకున్నది సాధిస్తారు. వ్యాపార భాగస్వాములతో, కస్టమర్లతో చేసే చర్చలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటుంది. ధనలాభం, వస్త్ర లాభం ఉన్నాయి. అభయ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మేలు జరుగుతుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడి పెరగకుండా సమయానికి పనులు పూర్తి చేసుకోండి. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి. నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్త ఉండండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.